Home
Apps

ఆగష్టు 27న కింబో యాప్ రీ ఎంట్రీ, కిల్లర్ ఫీచర్స్ ఇవే

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌కు పతంజలి సంస్థ షాకిస్తూ "కింభో" యాప్ పేరిట సరికొత్త దేశీయ ఛాటింగ్ యాప్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.

By Anil

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌కు పతంజలి సంస్థ షాకిస్తూ "కింభో" యాప్ పేరిట సరికొత్త దేశీయ ఛాటింగ్ యాప్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే లాంచ్ అయిన వెంటనే ఈ యాప్ ఎన్నో సమస్యలను ఎదుర్కుంది. ఈ కింబో యాప్ చాలా ప్రమాదంతో కూడుకున్నదని చాలా మంది విమర్శించారు. అందులో భాగంగానే గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్ ను డిలీట్ కూడా చేసారు. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టేందుకు తిరిగి సరికొత్తగా "కింభో" యాప్ ను తీసుకురానున్నట్లు తెలిపింది. ఆధునిక ఫీచర్లతో కింభో యాప్‌ లాంచింగ్‌కు సిద్ధంగా ఉందంటూ పతంజలి సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు.

“Swadeshi app”

“Swadeshi app”

భారతీయుల కోసం రూపొందించిన స్వదేశీ యాప్‌.

Meaning of Kimbho

Meaning of Kimbho

కింభో అనేది సంస్కృత పదం. సంస్కృతంలో కింభో అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు అని అర్థం.

 Multimedia support

Multimedia support

ఈ కింభో యాప్‌లో వాట్సప్‌లోలాగే యూజర్లు ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, స్టిక్కర్లు పంపించుకోవచ్చు. వాట్సప్‌ లో సపోర్ట్ చేసే అన్ని మల్టీమీడియా ఫీచర్స్ ఈ కింభో యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి.

Video chatting

Video chatting

ఈ కింభో యాప్ వీడియో చాట్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకొని చాట్ చేసుకుపోవచ్చు.

Support for maps

Support for maps

వాట్సప్ కు లో ఉండే అన్ని ఫీచర్లకు కాంపిటీటర్ గా ఈ యాప్ ను తయారు చేసారు.ఈ యాప్ లో లొకేషన్ షేర్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

Encryption

Encryption

ఈ కింభో యాప్ లో కూడా వాట్సాప్ లోని ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లాగానే సెక్యూరిటీ ఫీచర్ ను అందిచనుంది. 

 Anonymity

Anonymity

ఈ కింభో యాప్ ఘోస్ట్ చాట్స్ ఆటో డిలీషన్ అఫ్ మెసేజెస్ ను సపోర్ట్ చేస్తుంది.

Security concerns

Security concerns

కింబో యాప్‌ మరో యాప్ అయిన బోలో మెసెంజర్‌కి కాపీ పేస్ట్ అని ఆరోపణలు ఎదుర్కుంది. అయితే వీటికి చెక్ పెట్టేందుకు సరికొత్తగా సెక్యూరిటీ ఫీచర్స్ తో ఇది లాంచ్ అవబోతుంది.

Permissions

Permissions

వాట్సాప్ లానే కింభో యాప్ లో మైక్, ఫోన్, కాంటాక్ట్స్ ,డివైస్ ID, ఫోటోలు, మల్టీమీడియా, కెమెరా వంటి వాటిని యాక్సిస్ చేయడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

Availability

Availability

ఈ కింభో యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ లో మే 30న లాంచ్ చేయడం జరిగింది.అయితే లాంచ్ అయిన 24 గంటల్లోనే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సంబంధిత స్టోర్లో నుంచి డిలీట్ కూడా చేయడమైంది. అయితే ఆగష్టు 27 నుంచి ఈ యాప్ గూగుల్ మరియు ఆపిల్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Ramdev’s ‘WhatApp killer’ coming: 10 top features.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X