పతంజలి కింభో యాప్ వచ్చింది,తీసేయడం అయింది,కారణం ఏంటో తెలుసా?

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌కు పతంజలి సంస్థ షాకిస్తూ కింభో యాప్ పేరిట సరికొత్త దేశీయ ఛాటింగ్ యాప్ విడుదల చేసింది.

|

సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌కు పతంజలి సంస్థ షాకిస్తూ కింభో యాప్ పేరిట సరికొత్త దేశీయ ఛాటింగ్ యాప్ విడుదల చేసింది. వాట్సప్‌కు పోటీగా కొత్త యాప్‌ను రూపకల్పన చేసింది. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేశారు. 'ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి' అంటూ తిజారావాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే అది ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో కనపడటం లేదు. దాన్ని తొలగించారు. దీనికి కారణం ఏంటనేది తెలియలేదు.అయితే పాకిస్తాన్ మోడల్ ఈ యాప్ వాడుతుందని అందుకే రిమూవ్ చేశారని ట్విటర్లో ఓ ట్వీట్ దర్శనమిస్తోంది.

మొబైల్ యూజర్లకు శుభవార్త, స్పామ్ కాల్స్ వస్తే రూ.76 లక్షల వరకు జరిమానామొబైల్ యూజర్లకు శుభవార్త, స్పామ్ కాల్స్ వస్తే రూ.76 లక్షల వరకు జరిమానా

మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సప్‌ను ఎదుర్కొనేందుకు..

మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సప్‌ను ఎదుర్కొనేందుకు..

స్వదేశీ సమృద్ధి సిమ్ పేరుతో ఓ సిమ్‌కార్డును విడుదల చేసి టెలికం రంగంలోకి ప్రవేశించిన పతంజలి సంస్థ.. తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ‘కింభో' పేరుతో సరికొత్త మెసేజింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. దీని లింక్ మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ కావడం లేదు.

https://play.google.com/store/apps/details?id=com.bolo.chat

పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేస్తూ..

కాగా యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేస్తూ.. ఇక భారత్ మాట్లాడుతుందని పేర్కొన్నారు. వాట్సప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోందని అన్నారు. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

వాట్సప్‌లో ఇతర ఫీచర్లు

వాట్సప్‌లో ఇతర ఫీచర్లు

ఈ కింభో యాప్‌లో వాట్సప్‌లోలాగే యూజర్లు ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు, స్టిక్కర్లు పంపుకోవచ్చన్నారు. ఉచితంగా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయంతోపాటు గ్రూప్‌లను క్రియేట్ చేసుకోవచ్చని చెప్పారు. దీంతోపాటు వాట్సప్‌లో ఉన్న ఇతర ఫీచర్లు కూడా ఈ యాప్‌లో లభిస్తాయని ఆయన తెలిపారు.

Irony Of India అనే ట్విట్టర్ బ్లాగ్ లో..

అయితే ఈ యాప్ వెంటనే రిమూవ్ ఎందుకు చేశారో తెలియడం లేదు. Irony Of India అనే ట్విట్టర్ బ్లాగ్ లో పాకిస్తాన్ మోడల్ ఈ యాప్ వాడుతోందని అందుకే రిమూవ్ చేశారని చెబుతున్నారు. అందులో ఎంత నిజం ఉందనేది తెలియడం లేదు.

రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా

రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా

ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసి రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

రూ.792, రూ.1584 లతోనూ..

రూ.792, రూ.1584 లతోనూ..

ఇప్పుడు తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ సిమ్ కార్డు వినియోగదారులకు మరో రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. పతంజలి సిమ్ కార్డులు కలిగిన వినియోగదారులు ఇప్పుడు రూ.144 మాత్రమే కాకుండా, రూ.792, రూ.1584 లతోనూ తమ కార్డులను రీచార్జి చేసుకోవచ్చు.

వాలిడిటీలు వేర్వేరుగా..

వాలిడిటీలు వేర్వేరుగా..

రూ.144 ప్లాన్‌లాగే మిగిలిన రెండు ప్లాన్లలోనూ రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. కాకపోతే వీటి వాలిడిటీలు వేర్వేరుగా ఉన్నాయి. రూ.144 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు ఉండగా, రూ.792 ప్లాన్ గడువు తేదీని 180 రోజులుగా నిర్ణయించారు. అదేవిధంగా రూ.1584 ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది.

ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే

ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే

ఈ సిమ్ కార్డులు ముందుగా పతంజలి గ్రూప్‌నకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే అందుబాటులో ఉంటాయని, తరువాత పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సిమ్ కార్డుల విడుదల సందర్భంగా యోగా గురువు బాబా రామ్‌దేవ్ వెల్లడించారు.

పతంజలి సిమ్ యూజర్లకు..

పతంజలి సిమ్ యూజర్లకు..

అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

Best Mobiles in India

English summary
WhatsApp Has Competition": Ramdev's Patanjali Launches Messaging App More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X