కింభో యాప్ మళ్లీ తెర వెనక్కి వెళ్లింది

ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌కు కిల్లర్‌గా దూసుకొచ్చిన రాందేవ్ బాబా స్వదేశీ యాప్ పూర్తి స్తాయి లాంచింగ్ కు ముందే సమస్యలను ఎదుర్కుంటోంది.

|

ముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌కు కిల్లర్‌గా దూసుకొచ్చిన రాందేవ్ బాబా స్వదేశీ యాప్ పూర్తి స్తాయి లాంచింగ్ కు ముందే సమస్యలను ఎదుర్కుంటోంది. ఈ కింబో యాప్ చాలా ప్రమాదంతో కూడుకున్నదని విమర్శలు వచ్చిన నేపథ్యంలో దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఆగస్టు 27న ఈ యాప్ అధికారికంగా లాంచ్ చేయనున్నామని పతంజలి సంస్థ ప్రకటించింది. అయితే అది కూడా తుస్సుమంది.

 

రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !రాందేవ్ బాబా కింభో యాప్ చాలా డేంజర్,హెచ్చరిస్తున్న నిపుణులు !

మళ్లీ నిరాశ

మళ్లీ నిరాశ

స‍్వదేశీ యాప్‌ అంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్నపతంజలి మెసేజింగ్‌ యాప్‌ లాంచింగ్‌ మళ్లీ నిరాశపర్చింది.

అధికారిక లాంచింగ్‌పై..

తొందరలోనే అధికారిక లాంచింగ్‌పై తేదీని ప్రకటిస్తామని పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

ట్రయల్స్‌, రివ్యూలు అప్‌ గ్రేడేషన్​ ప్రాసెస్ ..

ట్రయల్స్‌, రివ్యూలు అప్‌ గ్రేడేషన్​ ప్రాసెస్ ..

అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన యాప్‌ను అందించేందుకు ట్రయల్స్‌, రివ్యూలు అప్‌ గ్రేడేషన్​ ప్రాసెస్ చేస్తున్నాం. అధికారికంగా లాంచింగ్‌ తేదీని ప్రకటిస్తామంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

భద్రతాలోపం కారణంగా..
 

భద్రతాలోపం కారణంగా..

భద్రతాలోపం కారణంగా గూగుల్‌ నుంచి మిస్‌ కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 

యూజర్లలో నిరాసక్తత..

ఆగస్టు 27న అధికారికంగా కస్టమర్ల ముందుకు రానున్నామని ప్రకటించిన కింభో యాప్‌ లాంచింగ్‌ మళ్లీ నిరాశపర్చడంతో దేశీయ యాప్ మీద యూజర్లలో నిరాసక్తత ఏర్పడినట్లు తెలుస్తోంది.

వాట్సప్‌కు పోటీగా

వాట్సప్‌కు పోటీగా

కాగా ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం సొంతమైన వాట్సప్‌కు పోటీగా స్వదేశీయ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ మొబైల్‌ మెసేజింగ్‌ యాప్‌ కింభో పేరుతో విడుదల చేసుందుకు దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ప్రకటించింది.

రెండవసారి కూడా..

రెండవసారి కూడా..

ఆగష్టు 15న టెస్టింగ్‌ వెర్షన్‌గా డౌన్‌లోడింగ్‌కు అందుబాటు లోకి వచ్చింది. అయితే రెండవసారి కూడా గోప్యతా కారణాల రీత్యానే గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి అదృశ్యం కావడం గమనార్హం.

Best Mobiles in India

English summary
Patanjali postpones Kimbho chat app launch after missing deadline more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X