గూగుల్ తేజ్‌లో మరో సరికొత్త ఆప్సన్, రూ.1000 వరకు నగదు గెలుచుకునే అవకాశం

Written By:

సాఫ్‌వేర్ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ సంస్థ గూగుల్ భారత్‌లోని స్మార్ట్ ఫోన్ వినియోగదారు కోసం తేజ్ పేరిట మొబైల్ పేమెంట్స్ యాప్ ను లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ యాప్ లో ఇప్పటిదాకా కేవలం నగదు ట్రాన్స్‌ఫర్‌కు మాత్రమే అవకాశం ఉండేది. అయితే ఇకపై కూడా బిల్ పేమెంట్స్ కూడా చెయ్యవచ్చు. దాదాపు 90 కి పైగా బిల్లర్ల సపోర్టును ఇందులో ఏర్పాటు చేశారు. వినియోగదారులు గ్యాస్, విద్యుత్తు, వాటర్ బిల్లులను ఇందులో చెల్లించవచ్చు. అలాగే డీటీహచ్ రీచార్జిలను చెయ్యవచ్చు. ఇక ఇందులో వినియోగదారులు చెల్లించే ప్రతి బిల్ కు ఒక స్క్రాచ్ కార్డు లభిస్తున్నది. దీన్ని స్క్రాచ్ చేస్తే రూ .1000 వరకు నగదును గెలుచుకోడానికి అవకాశం ఉంది. ఆండ్రాయిడ్, ఐఫోఎన్లలో గూగుల్ తేజ్ అప్డేట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే పైన చెప్పిన బిల్ పేమెంట్స్ ఫీచర్ ను పొందవచ్చు.

ఇకపై 13 అంకెల నంబర్లు, మరి 10 నంబర్ల సిమ్ పరిస్థితి ఏంటీ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Google Tez యాప్‌కు బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేయటం ఎలా..?

స్టెప్ 1 :
Google Tez యాప్‌కు సంబంధించి ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ విజయంతంగా పూర్తి అయిన తరువాత, యూజర్ ప్రొఫైల్ నేమ్ క్రింద 'Add Bank Account' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
స్టెప్ 2 :
Google Tez యాప్‌ భారత్‌లోని అన్ని ప్రముఖ బ్యాంక్‌లను సపోర్ట్ చేస్తుంది. వాటిలో మీ బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే, మీరిచ్చిన మొబైల్ నెంబర్ నుంచి, ఆ బ్యాంక్ స్టాండర్డ్ ఆపరేటర్‌కు ఓ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ పంపబడుతుంది. ఆ మొబైల్ నెంబర్‌తో మీ అకౌంట్ లింక్ అయి ఉన్నట్లయితే ఆ వివరాలు వెంటనే యాప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి.
స్టెప్ 3 :
తరువాతి స్టెప్‌లో భాగంగా మీ బ్యాంక్ అకౌంట్ తాలుకూ UPI IDని ఎంటర్ చేయమని యాప్ అడుగుతుంది. మీరు గతంలోనే UPI IDని కలిగి ఉన్నట్లయితే మళ్లీ అదే ఐడీని వెరిఫికేషన్ నిమిత్తం ఎంటర్ చేయవల్సి ఉంటుంది. 'Enter UPI PIN' ఆప్షన్ పై టాప్ చేసి 4-అంకెల పిన్‌ను ఎంటర్ చేసినట్లయితే, ఆ UPI IDతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ యాప్‌లో యాడ్ అవుతుంది.
స్టెప్ 4 :
ఒకవేళ మీ వద్ద UPI ID అందుబాటులో లేనట్లయితే కొత్తది క్రియేట్ చేసుకోవటం చాలా సులువు. యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకునేందుకు స్టెప్ 2లో కనిపించే bank and mobile number ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని 'Proceed' బటన్ పై టాప్ చేయవల్సి ఉంటుంది.
స్టెప్ 5 :
ఇక్కడ మీ నెంబర్‌తో లింక్ అయి ఉన్న డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసినట్లయితే వెరిఫికేషన్ నిమిత్తం ఓ OTP మీకు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత మీకు నచ్చిన 4-అంకెల UPI పిన్‌ను సెట్ చేసుకునే వీలుంటుంది. ఆ తరువాత నుంచి Google Tez యాప్‌ ద్వారా విజయవంతగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Google Tez ద్వారా డబ్బులు పంపడం ఎలా..?

మందుగా ఇనీషియల్ సెటప్ ప్రాసెస్...
స్టెప్ 1 :
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Google Tez యాప్‌ను, మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు యాపిల్ ఐఫోన్‌ను వినియోగిస్తున్నట్లయితే ఐఓఎస్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను పొందవల్సి ఉంటుంది.
స్టెప్ 2 :
Google Tez యాప్‌ మీ ఫోన్‌లో విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన తరవాత యాప్‌ను ఓపెన్ చేసి ముందుగా భాషను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్‌ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. భాషను ఎంపిక చేసుకున్న తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే Arrow మార్క్ పై టాప్ చేసినట్లయితే తరువాతి మెనూలోకి వెళతారు.
స్టెప్ 3 :
ఈ మెనూలో మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటంది. (ముఖ్య గమనిక : మీరు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయి ఉండాలి).
స్టెప్ 4 :
తరువాతి స్టెప్‌లో భాగంగా Tez యాప్‌‌తో లింక్ చేయవల్సిన గూగుల్ అకౌంట్ తాలుకా వివరాలకు యాప్ అడుగుతుంది. మీ గూగుల్ అకౌంట్‌ను లింక్ చేసి యాప్ రిక్వెస్ట్‌లకు యాక్సెస్ ఇచ్చినట్లయితే OTP వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.
స్టెప్ 5 :
OTP వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత Google Tez యాప్‌ సెక్యూరిటీకి సంబంధించి డివైస్ లాక్ లేదా సపరేట్ గూగుల్ పిన్‌ను క్రియేట్ చేసుకోవల్సి ఉంటుంది. దీంతో యాప్‌కు సంబంధించిన ఇనీషియల్ సెటప్ ప్రాసెస్ పూర్తవుతుంది.

గూగుల్‌లో ఈ పదాలు టైప్ చేస్తే నవ్వులే నవ్వులు

ఈ పదం టైపు చేస్తే మీకు ఇలా దర్శనమిస్తుంది. ఫ్లిప్ ఇట్ అని దీన్ని చూపిస్తుంది కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి.

రోల్ ఏ డైస్ ( Roll A Dice)

దీన్ని మీరు టైపు చేసి చూస్తే నాలుగు నంబర్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది.

ఆస్క్యూ ( Askew)

ఈ పదాన్ని మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే చిత్ర విచిత్రమైన సైట్లు వస్తాయి.

జెర్గ్ రష్ ( Zerg Rush )

ఈ పదం మీరు గూగుల్ లో వెతికారంటే అది ఏం చూపిస్తుందో తెలియక తలలు పట్టుకుంగారు మీరు. అన్నీ సున్నాలు వచ్చి కంటెంట్ చెరిపేస్తూ పోతుంటాయి.

అటారీ బ్రేక్ అవుట్ ( Atari Breakout)

ఈ పదాన్ని మీరు గూగుల్ లో టైపు చేశారనుకోండి. మీకు ఓ క్లాసిక్ ఆట కనిపిస్తుంది.

గూగుల్ పేస్ మ్యాన్ ( Google Pacman )

ఈ పదం టైపు చేస్తే మీకు ఏవో లైట్లు వచ్చి క్లిక్ టూ ప్లే అంటూ వస్తుంది. మరి దీని అర్థం ఏంటో దాని అర్థం ఏంటో తెలియక తలలు గోక్కోవాల్సిందే.

గూగుల్ గ్రేవిటీ ( Google Gravity )
ఈ పదం టైపు చేస్తే మీ డెస్క్ టాప్ మీద గూగుల్ పై నుంచి కిందకు వచ్చి అనేక రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google’s Tez payments app now lets users handle their utility bills and more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot