‘Pay with Google’తో వేగవంతమైన చెల్లింపులు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, 'Pay with Google' పేరుతో సరికొత్త మొబైల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది.

|

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, 'Pay with Google' పేరుతో సరికొత్త మొబైల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఇంచుమించుగా ఇ-వాలెట్స్ తరహాలో పనిచేసే ఈ ఫీచర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆన్‌లైన్ పేమెంట్‌లను మరింత వేగవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది.

‘Pay with Google’ has been launched to enable faster checkouts

Pay with Google ద్వారా పేమెంట్స్ చేసే సమయంలో విసుగుపుట్టించే చెక్‌అవుట్స్, టైమ్డ్ అవుట్ సెషన్స్, అనవసర ఫామ్ ఫిల్లింగ్ వంటి తలనొప్పులు ఉండవు. యూజర్ తన గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న కార్డును ఉపయోగించుకుని వేగవంతంగా చెక్‌అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది.

షియోమి MIUI 9 అప్‌డేట్ బెస్ట్ ఫీచర్లు, వీటిని మిస్ కాకండి !షియోమి MIUI 9 అప్‌డేట్ బెస్ట్ ఫీచర్లు, వీటిని మిస్ కాకండి !

Pay with Google ఆప్షన్ ప్రస్తుతానికి మొబైల్ యాప్స్ ఇంకా గూగుల్ క్రోమ్‌లో మాత్రమే వర్క్ అవుతోంది. 'పే విత్ గూగల్’ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే సమయంలో గూగుల్ ప్లే, యూట్యూబ్, క్రోమ్, ఆండ్రాయిడ్ పే వంటి గూగుల్ అకౌంట్స్‌తో లింక్ అయి ఉన్న ఎటువంటి క్రెడిట్ లేదా డెబిట్ కార్డునైనా మీరు ఉపయోగించుకోవచ్చు. గూగుల్ పేమెంట్ API టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటలోకి రాకపోవటంతో 'pay with Google’ ఆప్షన్ ప్రస్తుతానికి 15 చోట్ల మాత్రమే వర్క్ అవుతోంది.

రూ. 69కే అన్‌లిమిటెడ్ కాల్స్, వొడాఫోన్ మరో షాక్ !రూ. 69కే అన్‌లిమిటెడ్ కాల్స్, వొడాఫోన్ మరో షాక్ !

గూగుల్, ఇటీవలే తన తేజ్ పేమెంట్ సర్వీసును మార్కెట్లో లాంచ్ చేసింది. తేజ్ యాప్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి వేరొకరి అకౌంట్లలోకి నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది.

క్రోమ్ ట్రాఫిక్ 60% సురక్షితంక్రోమ్ ట్రాఫిక్ 60% సురక్షితం

యూపీఐ ఐడి, క్యూఆర్ కోడ్ ఇంకా మొబైల్ పేమెంట్స్‌ను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ తేజ్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌పోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను మరింతగా ప్రమోట్ చేసేందుకు రిఫరల్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను కూడా గూగుల్ అనౌన్స్ చేసింది.

ఈ రిఫరల్ ప్రోగ్రామ్ క్రింద ఈ యాప్‌ను మీ స్నేహితులకు రిఫర్ చేసి, వారిని ఉపయోగించుకునేలా చేసినట్లయితే మీతో పాటు మీ స్నేహితులకు రూ.51 రివార్డ్ లభిస్తుంది. ఇలా రూ.9,000 వరకు రివార్డు గెలుచుకునే వీలుంటుంది. ఏప్రిల్ 1, 2018 వరకు ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google has announced the launch of the Pay with Google feature that will let users enable faster checkouts.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X