ఇక పేటీఎమ్‌లో చాటింగ్ చేస్తూ డబ్బులు పంపుకోవచ్చు

|

పేటీఎమ్ ఇన్‌బాక్స్ పేరుతో సరికొత్త మెసిజింగ్ ఫీచర్‌ను పేటీఎమ్ లాంచ్ చేసింది. ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పేటీఎమ్ యూజర్లు మెసేజెస్, ఫోటోస్ ఇంకా వీడియోస్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవటంతో పాటు పేటీఎమ్ వాలెట్‌ను ఉపయోగించుకుని నగదును కూడా సెండ్ చేసుకునే వీలుంటుంది.

 
Paytm Inbox feature lets users chat and send or receive money

ఈ కొత్త ఫీచర్‌ను ఇంట్రడ్యూస్ చేయటం ద్వారా పేటీఎమ్, వాట్సప్‌కు సవాల్ విసిరినట్లయ్యింది. పేటీఎమ్ మెసేజింగ్ సర్వీసులో మెసేజ్ రీకాల్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

 

పేటీఎమ్ ఇన్‌బాక్స్ లాంచ్ సందర్బంగా కంపెనీ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ దీపక్ అబాట్ స్పందిస్తూ, తమ కస్టమర్‌లతో పాటు మర్చెంట్స్ ఇన్‌స్టెంట్ పేమెంట్స్‌తో పాటు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసు కోవాలనుకుంటున్నారు. దీంతో వారికో సోషల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అవసరమని గుర్తించాం. ఆ క్రమంలోనే సోషల్ మేసేజింగ్‌ను కామర్స్ అండ్ పేమెంట్స్‌తో బ్లెండ్ చేసి పేటీఎమ్ ఇన్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాని తెలిపారు.

పేటీఎమ్ ఇన్‌బాక్స్ సదుపాయాన్ని ఆండ్రాయిడ్ యాప్‌లో ఇప్పటికే అప్‌డేట్ చేసినట్లు పేటీఎమ్ తెలిపింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్‌లోకి తమ పేటీఎమ్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా పేటీఎమ్ ఇన్‌బాక్స్ సదుపాయాన్ని పొందవచ్చు. iOS యాప్ యూజర్లకు పేటీఎమ్ ఇన్‌బాక్స్ సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని పేటీఎమ్ వెల్లడించింది.

రూ.4890కే 'కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ'రూ.4890కే 'కార్బన్ కే9 స్మార్ట్ సెల్ఫీ'

పేటీఎమ్ ఇన్‌బాక్స్ ఫీచర్‌, యాప్ నేవిగేషన్ బార్ బోటమ్‌లో యాడ్ అయి ఉంటుంది. యాప్‌ను ఓపెన్ చేసి Inbox ఆప్షన్ పై టాప్ చేయటం ద్వారా చాట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ చాట్ విండోలో యూజర్ పేటీఎమ్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా చాటింగ్‌తో పాటు డబ్బును సెండ్ చేసుకునే వీలుంటుంది. చాట్ స్ర్కీన్ పై కనిపించే న్యూ మెసేజ్ బటన్ పై ప్రెస్ చేయటం ద్వారా పేటీఎమ్ సర్వీసును ఉపయోగించుకుంటోన్న వారి ఫోన్ నెంబర్లు యూజర్‌కు కనిపిస్తాయి.

పేటీఎమ్ ఇన్‌బాక్స్ పేజీలో మెసేజ్‌ను టైప్ చేసుకునేందుకు అవసరమైన సింగిల్ లైన్‌తో పాటు కెమెరా, గ్యాలరీ ఇంకా లొకేషన్ షేరింగ్‌కు సంబంధించిన ఐకాన్స్ కనిపిస్తాయి. వీటితో పాటు నగదు ట్రాన్స్‌ఫర్ లేదా రిసీవ్ చేసుకునేందుకు అవసరమైన ఆప్షన్ కూడా ఉంటుంది.

తమ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయాన్ని కలిగి ఉందని, యూజర్లు ప్రైవసీకి ఎటువంటి భంగం వాటిల్లదని పేట్ఎమ్ చెబుతోంది. తమ ప్లాట్ఫామ్ ద్వారా ప్రైవైట్ కన్వర్జేషన్స్‌తో పాటు గ్రూప్ చాట్‌లను కూడా నిర్వహించుకోవచ్చని సంస్థ చెబుతోంది.

పేటీఎమ్ ఇన్‌బాక్స్ ద్వారా లైవ్ వీడియోస్ అలానే ఫోటోలను పంపాల్సి వచ్చినప్పుడు ఫోన్ కెమెరాతో తమ యాప్ కనెక్ట్ అవుతుందని తద్వారా ఫోటోలతో పాటు వీడియోలను షూట్ చేసుకునే వీలుంటుందని పేటీఎమ్ తెలిపింది.

Best Mobiles in India

Read more about:
English summary
Paytm Inbox is a new feature that has been rolled out to the app letting users send or receive money and chat with contacts.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X