గూగుల్ ప్లే స్టోర్లో...పేటిఎం మాల్ దే టాప్ ప్లేస్!

Posted By: Madhavi Lagishetty

గూగుల్ ప్లే స్టోర్ బెస్ట్ ఆఫ్ 2017 యాప్ జాబితాను ప్రకటించింది. ఇందులో పేటిఎం మాల్ గూగుల్ ఇండియా ఇ-రీటైల్ యాప్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది ఈ యాప్ ఒక్కటే.

గూగుల్ ప్లే స్టోర్లో...పేటిఎం మాల్ దే టాప్ ప్లేస్!

వన్97 కమ్యూనికేషన్స్ పేటీఎం యొక్క ఆన్ లైన్ మార్కెట్ మరియు ఆర్మ్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పేటీఎం మాల్ ను ప్రారంభించింది. ఈ మధ్యే పేటీఎం మాల్ తన కొత్త ఆఫర్ను ప్రకటించింది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులు వారి డివైసులను కాపాడేందుకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందవచ్చు.

కొత్త ప్లాన్ స్క్రీన్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్, దొంగిలించబడినా...సంవత్సరం పొడవునా కవరేజ్ అందిస్తుంది. కొత్త మొబైల్ కొనుగోళు చేయాలనుకుంటే ఈజీ ప్రొసెస్ను ప్రొవైడ్ చేస్తారు. ఫోన్ ధరలో దాదాపు 5శాతం తక్కువ ధరతో అందుబాటులో ఉంటాయి.

బైకర్స్ కోసం మోటర్ సైకిల్ మోడ్...గూగుల్ మ్యాప్స్ నుంచి కొత్త ఫీచర్!

ఈ ఆఫర్ ప్రస్తుతం ఆపిల్, జియోమీ, మోటరోలా, వివో, ఒప్పో మరియు ఇతర మొబైల్ ఫోన్ బ్రాండ్లలో అందుబాటులో ఉంది. ఇతర బెనిఫిట్స్ పొందేందుకు వినియోగదారులు మాత్రమే ప్రత్యేకమై టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాల్సి ఉంటుంది. డివైస్ వారి ఇంటి నుంచి సెలక్ట్ చేయబడుతుంది. లేదా వినియోగదారులు సమీప రిపేర్ స్టోర్ డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది.

మాల్ వినియోగదారులకు సమర్థవంతమైన ఆన్ లైన్ షాపింగ్ అనుభవాన్ని అందించడానికి దేశవ్యాప్తంగా 17 సఫలీక్రుత కేంద్రాలను కలిగి ఉంది.

ఆపిల్, శాంసంగ్, ఎల్జీ, ఒప్పో, సోనీ, హెచ్ పి, లెనోవా, జెబిఎల్, ఫిలిప్స్, ప్యూమా, అల్లెన్, సోలిలీ, లీ, పేపే, వాన్ సహా పలు రకాల బ్రాండ్లతో భాగస్వామ్యంలో పేటిఎం మాల్ కూడా విస్త్రతమైన షాపింగ్ ఆప్షన్స్ ను అందిస్తుంది. హ్యుసన్, ఉడ్ల్యాండ్, కాట్వాక్, స్కెచెర్స్, లేవిస్, వెరోమోడ, రెడ్ టేప్, క్రాక్స్ ఫాసిల్ ఇతరులు కూడా ఉన్నారు.

ఇది భారతదేశం అంతటా 17,000కంటే ఎక్కువ పిన్ కోడ్లను అందిస్తుంది. ఈ మోడ్ ప్రస్తుతం ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది.

Read more about:
English summary
The mall has over 17 fulfillment centers across the country to offer consumers an efficient online shopping experience.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot