పేటీఎమ్‌లో దుమ్మురేపుతున్న డిస్కౌంట్లు ,రూ.20,000 వేల వరకు..

Written By:

ఈ కామర్స్ దిగ్గజాలకు పేటీఎమ్ సవాల్ విసురుతోంది. ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్నఅమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు తమ బంపర్‌ డిస్కౌంట్‌ సేల్స్‌ను ప్రకటించిన అనంతరం పేటీఎమ్ కూడా కాచుకోండి అంటూ బంపరాఫర్లను ప్రకటించింది. ఈ భారీ డీల్స్ దాదాపు వారం రోజుల పాటు అలరించనున్నాయి.

అంతుచిక్కని ఐఫోన్ 7ఎస్, ఐఫోన్‌8 ఫీచర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండిపెండెన్స్‌ డేకి ముందస్తుగా

ఇండిపెండెన్స్‌ డేకి ముందస్తుగా పేటీఎం మాల్‌ తన యాప్‌, వెబ్‌సైట్‌లో స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లకు తెరతీసింది.

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, అప్లియెన్స్‌, అప్పీరల్స్‌, యాక్ససరీస్‌ వంటి అన్ని ఉత్పత్తులపైనా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనున్నట్టు ఈ మాల్‌ వెల్లడించింది.

20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను

ఈ సేల్‌ సందర్భంగా ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు, ఇంకా 20వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది.

అతిపెద్ద హైలెట్‌,

ఈ సేల్‌లో అతిపెద్ద హైలెట్‌, ఐఫోన్‌ 7పై 8000 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయడం.

ఐఫోన్‌ ఎస్‌ఈపై

అంతేకాక ఐఫోన్‌ ఎస్‌ఈపై కూడా ఫ్లాట్‌ 15 శాతం డిస్కౌంట్‌, రూ.3000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం అందిస్తోంది. దీంతో 27,200 రూపాయలుగా ఉన్న ఐఫోన్‌ ఎస్‌ఈ ధర 19,990కి దిగొచ్చింది.

అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను

వీటితో పాటు షాపింగ్‌ ఓచర్లను, అదనంగా 5000 రూపాయల విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను అందిస్తోంది. వీటిని విమానాలు‌, అప్పీరల్స్‌, మొబైల్‌ యాక్ససరీస్‌పై వాడుకోవచ్చు.

ఐఫోన్‌ 6

ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్లు రూ.3000, రూ.3500 క్యాష్‌బ్యాక్‌లతో పేటీఎం మాల్‌లో లిస్టయ్యాయి.

ఎంఐ మ్యాక్స్‌ 2

షావోమి ఇటీవల లాంచ్‌చేసిన ఎంఐ మ్యాక్స్‌ 2 కూడా పేటీఎం తన మాల్‌లో అందుబాటులో ఉంచింది. లెనోవో, మైక్రోమ్యాక్స్‌, వివో స్మార్ట్‌ఫోన్లపై కనీసం 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది.

ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే

ఇక ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే, ఆపిల్‌, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్లపై రూ.20వేల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందించనున్నట్టు పేటీఎం మాల్‌ చెప్పింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Mall Independence Day Sale Offers: iPhone 7, Laptops, and Other Deals Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot