తొలిసారిగా పేటీఎమ్ నుంచి భారీ ఆఫర్లు, రూ.501 కోట్లకు పైనే..

Written By:

ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లకు పోటీగా పేటీఎం మాల్ కూడా దూసుకువస్తోంది. వాటికి పోటీగా మెగా సేల్‌ ఈవెంట్‌ను ప్రకటించింది. 'మెరా క్యాష్‌ బ్యాక్‌' పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ నిర్వహించే తేదీల్లోనే పేటీఎం మాల్‌ కూడా ఈ మెగా సేల్‌ ఈవెంట్‌కు తెరలేపబోతుంది. ఈవెంట్‌లో భాగంగా రూ.501 కోట్ల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను కంపెనీ అందించనున్నట్టు ప్రకటించింది.

ఆఫర్ల యుద్ధం : భారీ డిస్కౌంట్లతో అమెజాన్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ నెల 20 నుంచి 23 వరకు

ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ ఈవెంట్‌ నిర్వహించనుంది. కొత్తగా 50 లక్షల మంది కొనుగోలుదారులను ఆకర్షించాలనే లక్ష్యంగా ఈ సేల్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు కంపెనీ చెప్పింది.

15 శాతం నుంచి 100 శాతం వరకు

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ ఫోన్లు, ఫ్యాషన్‌ ప్రొడక్ట్‌లు, ఇతర ఉత్పత్తులపై 15 శాతం నుంచి 100 శాతం వరకు పేటీఎం మాల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందించనుంది.

స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు

స్మార్ట్‌ఫోన్లపై రూ.15వేల వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.20వేల వరకు, పెద్ద పెద్ద అప్లియెన్స్‌ టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లపై 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించింది.

100 శాతం క్యాష్‌బ్యాక్‌

25 మంది ఫోన్‌ కొనుగోలుదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది.

100 గ్రాముల పేటీఎం గోల్డ్‌

అదేవిధంగా నాలుగు రోజుల సేల్‌లో భాగంగా ప్రతి రోజూ 200 మంది వినియోగదారులకు 100 గ్రాముల పేటీఎం గోల్డ్‌ను కూడా ప్రకటించింది.

తొలి పండుగ సేల్‌ ఇదే

పేటీఎం మాల్‌ నిర్వహిస్తున్న తొలి పండుగ సేల్‌ ఇదేనని, తమ భాగస్వామ్య బ్రాండులు, మెర్చంట్లతో కలిసి క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందించనున్నట్టు చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అమిత్‌ సిన్హా తెలిపారు.

ఆపిల్‌, జేబీఎల్‌, ఉడ్‌ల్యాండ్‌

ఆపిల్‌, జేబీఎల్‌, ఉడ్‌ల్యాండ్‌, టైమెక్స్‌లు ఈ సేల్‌లో టాప్‌ బ్రాండులుగా ఉన్నాయి. తమ విక్రయాలను పెంచుకోవడానికి రిటైలర్లతో కూడా పేటీఎం మాల్‌ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఈ కంపెనీ ఇటీవలే అలీబాబా, ఎస్‌ఏఐఎఫ్‌ పార్టనర్ల నుంచి ఫండ్స్‌ సేకరించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Mall to launch first major sale event on 20-23 September Read more At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot