సినిమా టికెట్లపై పేటీఎమ్ ఊహించని ఆఫర్ !

Written By:

మీరు పేటీఎమ్‌లో సినిమా టికెట్ బుక్ చేసుకున్నారా..అయితే అర్జంట్ పని ఉండి ఆ సినిమాకు వెళ్లడం లేదా..అయితే మీరు చేసే పని దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం. కాని ఇప్పటిదాకా ఆ ఆప్సన్ లేకపోవడంతో చాలామంది డబ్బు పోయిందని బాధపడుతూ క్యాన్సిల్ చేసుకోవడం మానేస్తుంటారు. ఇప్పుడు అలాంటి బాధ లేకుండా పేటీఎమ్ బంపరాఫర్ ఇస్తోంది.

మోగనున్న కాల్ రేట్లు, గుండెలు బాదుకుంటున్న జియో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌ పై

టిక్కెట్‌ క్యాన్సిలేషన్‌ పై పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌ యూజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మూవీ టిక్కెట్లను బుక్‌ చేసుకుని, క్యాన్సిల్‌ చేసుకుంటే, పూర్తి మొత్తాన్ని రీఫండ్‌ చేయనున్నట్టు తెలిపింది.

తొమ్మిది రూపాయల ఛార్జీ

అయితే దీనికోసం స్వల్పంగా తొమ్మిది రూపాయల ఛార్జీ చెల్లించాలి అంతే. అది కూడా టిక్కెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడే కట్టాలి.

క్యాన్సిలేషన్‌ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను

దీనికోసం పేటీఎం క్యాన్సిలేషన్‌ ప్రొటెక్ట్‌ అనే కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌తో షో ప్రారంభం కావడానికి మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకోవచ్చు.

బుక్‌మైషో ఇప్పటికే

పేటీఎం ప్రస్తుతం తీసుకొచ్చిన క్యాన్సిలేషన్‌ ప్రొటెక్ట్‌ దాని ప్రత్యేకమైన ఫీచరేమీ కాదు. బుక్‌మైషో ఇప్పటికే రిజర్వు టిక్కెట్‌ ఫీచర్‌తో ఇలాంటి సౌకర్యాన్నే అందిస్తోంది.

సైట్‌లో టిక్కెట్ల కోసం వెతికే కస్టమర్లకు

అయితే తాజాగా పేటీఎం తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ కూడా యూజర్లందరికీ అందుబాటులో లేదంట. సైట్‌లో టిక్కెట్ల కోసం వెతికే కస్టమర్లకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చిందని తెలిసింది.

మూడు గంటల ముందు టిక్కెట్లను

యూజర్లు టిక్కెట్‌ కొనుగోలుతో పాటు ఒక్కో టిక్కెట్‌పై తొమ్మిది రూపాయలు చెల్లించాలి. మూడు గంటల ముందు టిక్కెట్లను క్యాన్సిల్‌ చేసుకునే పరిస్థితి వస్తే, పేటీఎం క్యాష్‌బ్యాక్‌ రూపంలో మొత్తం నగదు రీఫండ్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm Now Offering Refunds for Movie Tickets at a Nominal Charge Read More At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot