వాట్సప్‌కు పేటీఎమ్ దిమ్మతిరిగే షాక్..!

వాట్సప్‌కు పేటీఎం పోటీగా రాబోతోందా? ఇది మెసేజింగ్‌ సర్వీసులను ప్రారంభించటానికి సర్వం సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

By Hazarath
|

వాట్సప్‌కు పేటీఎం పోటీగా రాబోతోందా? ఇది మెసేజింగ్‌ సర్వీసులను ప్రారంభించటానికి సర్వం సిద్ధం చేసుకుంటోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. పేటీఎం ఈ నెలాఖరు నాటికి మెసేజింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది.

డబుల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ సీ7, ఫస్ట్ ఫోన్ ఇదే !డబుల్ కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ సీ7, ఫస్ట్ ఫోన్ ఇదే !

తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్‌ను

తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్‌ను

పేటీఎం తన ప్లాట్‌ఫామ్‌కు కొత్త ఫీచర్‌ను జోడించనుందని, దీని ద్వారా యూజర్లు చాట్‌ చేసుకోవచ్చని, అలాగే ఆడియో, వీడియో, ఫోటోలను షేర్‌ చేసుకోవచ్చని ఈ వ్యవహారంతో సంబంధమున్న కొందరు తెలియజేశారు.

ఈ నెల చివరినాటికి

ఈ నెల చివరినాటికి

సాఫ్ట్‌ బ్యాంక్‌, అలీబాబా మద్దతునందిస్తున్న ఈ ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ ఈ నెల చివరినాటికి ఈ యాప్‌ను లాంచ్‌ చేయనుంది.

దేశ ప్రజలను ఆకర్షించే విధంగా

దేశ ప్రజలను ఆకర్షించే విధంగా

ఇప్పటికే ఆహారం నుంచి..విమాన టికెట్ల దాకా ప్రతీదాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్న పేటీఎం దేశ ప్రజలను ఆకర్షించే విధంగా దీన్ని రూపొందించిందట.

ఈ యాప్‌ ద్వారా

ఈ యాప్‌ ద్వారా

ముఖ్యంగా ఈ యాప్‌ ద్వారా సందేశాలు, ఫోటోలు,ఆడియో, వీడియోలు షేర్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై అటు పేటీఎం, ఇటు వాట్సాప్‌ స్పందించాల్సి ఉంది.

ప్రస్తుతం 22. 5 కోట్లకు

ప్రస్తుతం 22. 5 కోట్లకు

కాగా పేటీఎం ప్రస్తుతం 22. 5 కోట్లకు (225 మిలియన్లు) పైగా వినియోగదారులను కలిగి ఉంది. మరోవైపు అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న వాట్సాప్‌ రోజువారీ వినియోగదారుల సంఖ్య ఇటీవల వందకోట్లను దాటేసింది.

Best Mobiles in India

English summary
Paytm Plans to Launch Messaging Service to Rival WhatsApp Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X