పేటీఎం కా ఏటీఎమ్, ప్రయోజనాలు ఇవే !

Written By:

ఇండియాలో దూసుకుపోతున్న డిజిటల్ పేమెంట్ దిగ్గజం పేటీఎమ్ ఓ సరికొత్త వ్యూహంతో దూసుకురాబోతోంది. వచ్చే నెలల్లో లక్ష కిరాణా స్టోర్లతో పేటీఎం డిజిటల్‌ బ్యాంకు భాగస్వామ్యం ఏర్పరచుకోబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, బీ-టౌన్లలో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు పేటీఎం సరికొత్త ఆలోచన చేసింది.

జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను..

పేటీఎం లాంచ్ చేసిన ఈ పేమెంట్ బ్యాంకులో వినియోగదారులు జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లను ప్రారంభించుకోవచ్చు. దీంతో పాటు మీరు ఎటువంటి డిజిటల్ లావాదేవీలు జరిపినా జీరో ఛార్జీలు ఉంటాయి.

పేటీఎం కా ఏటీఎం

పేటీఎం కా ఏటీఎం పేరుతో దూసుకువస్తొంది. దీని అర్థం కిరాణా స్టోర్లే ఇకపై ఏటీఎంలుగా పనిచేయనున్నాయి. వీటిలోనే కస్టమర్లు సేవింగ్స్‌ అకౌంట్లు ప్రారంభించుకునేందుకు, నగదును డిపాజిట్‌ చేసి, విత్‌డ్రా చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్‌ సౌకర్యం

ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 'పేటీఎం కా ఏటీఎం' బ్యాంకింగ్‌ అవుట్‌లెట్లను ప్రారంభిస్తున్నామని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సీఈవో, ఎండీ రేణు సతి చెప్పారు.

నగదును డిపాజిట్‌ చేయడం, విత్‌డ్రా చేయడం..

తమ ఇంటి పక్కనే ఉన్న అవుట్‌లెట్‌ను సందర్శించి, బ్యాంకు అకౌంట్‌ ప్రారంభించుకోవచ్చని, నగదును డిపాజిట్‌ చేయడం, విత్‌డ్రా చేయడం, అదనంగా ఆధార్‌ లింక్‌ను చేపట్టడం వంటి లావాదేవీలను చేపట్టుకోవచ్చని చెప్పారు.

హైపర్‌-లోకల్‌ మోడల్‌ బ్యాంకింగ్‌ కీలక పాత్ర..

నాణ్యమైన బ్యాంకింగ్‌ సర్వీసులను లక్షల కొద్దీ పనిచేసే, పనిచేయని కస్టమర్లకు అందజేయడానికి హైపర్‌-లోకల్‌ మోడల్‌ బ్యాంకింగ్‌ కీలక పాత్ర పోషిస్తుందని తాము నమ్ముతున్నట్టు ఆయన తెలిపారు.

 

 

3000 స్టోర్లతో పేటీఎం ఒప్పందం..

ఢిల్లీ ఎన్‌సీఆర్‌, లక్నో, కాన్పూర్‌, అలహాబాద్‌, వారణాసి​, అలిఘర్‌ వంటి ఎంపికచేసిన నగరాల్లో 3000 స్టోర్లతో పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్‌లైన్‌ విస్తరణ కోసం దాదాపు రూ.3వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm to provide cash via 1 lakh trained agents More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot