పేటీఎంలో డబ్బులు వేస్తున్నారా..మీ డబ్బులు గోవిందా ఇక !

Written By:

డిజిటల్ పేమెంట్ల రంగంలో దూసుకుపోతున్న పేటీఎమ్ యూజర్లకు సైలెంట్ గా షాకిచ్చింది. చడీచప్పుడు లేకుండా ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన ప్లాట్‌ఫామ్‌పై అతిపెద్ద మార్పు చేపట్టింది. క్రెడిట్‌ కార్డుల ద్వారా వాలెట్‌కు రీఛార్జ్‌ చేసుకునే మనీని గిఫ్ట్‌ ఓచర్లుగా మార్చేస్తోంది. అంటే పేటీఎం వాలెట్‌లోకి ఎవరైనా క్రెడిట్‌ కార్డు ద్వారా నగదును యాడ్‌ చేస్తే, ఈ నగదు వెంటనే గిఫ్ట్‌ ఓచర్లుగా మారిపోతాయి. వాటిని కేవలం పేటీఎం మాల్‌లో ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదా రీఛార్జ్‌లు చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. దీనిపై పేటీఎం యూజర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

డేటింగ్ ఎవరితో..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన సోఫియా !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

క్రెడిట్ కార్డు ద్వారా పంపిన ఈ నగదును ..

మీరు పేటీఎంలోకి క్రెడిట్ కార్డు ద్వారా పంపిన ఈ నగదును బ్యాంకుకు లింక్‌ చేయడం కానీ, స్నేహితులకు ట్రాన్సఫర్‌ చేయడం కానీ ఇక నుంచి కుదరదు. కాగా పరిమిత కాల వ్యవధిలో కంపెనీ దీన్ని లాంచ్‌ చేసిందని, ఈ కొత్త రూల్‌ ఫిబ్రవరి 15 నుంచి పేటీఎమ్ ప్రారంభించిందని అవుట్‌లుక్‌ రిపోర్టు చేసింది.

సమాచారం లేకుండా..

అయితే దీనిపై యూజర్లు మండిపడుతున్నారు. పరిమిత కాల ట్రయల్స్‌ అయినా కనీసం సమాచారం లేకుండా పేటీఎం ఇలా చేయడం దారుణమంటున్నారు. ట్విట్టర్‌ వేదికగా కంపెనీపై మండిపడుతున్నారు.

పేటీఎం గిఫ్ట్‌ ఓచర్లు..

క్రెడిట్‌ కార్డు వాడుతూ.. పేటీఎం వాలెట్‌లో ఎందుకు నగదు యాడ్‌ చేయాలి? పేటీఎం గిఫ్ట్‌ ఓచర్లు బలవంతంగా ఎందుకు కొనుగోలు చేయిస్తున్నారు? ఈ పరిమితులు ఎందుకు? అంటూ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లను దోచుకోవడంలో ఇది మరో రకమైన పేటీఎం మోసమంటూ పాలసీలో మార్పులపై ఎలాంటి సమాచారం ఇ‍వ్వకపోవడంపై కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.

పేటీఎం గిఫ్ట్‌ వాల్యుమ్‌ లోకి ..

ఈ ట్వీట్లపై స్పందించిన పేటీఎం.. ఇకపై క్రెడిట్‌ కార్డు ద్వారా మీరు లావాదేవీలు జరిపితే, అది పేటీఎం గిఫ్ట్‌ వాల్యుమ్‌ లోకి యాడ్‌ అవుతుంది. ఈ నగదుతో పేటీఎం యాప్‌పై రీఛార్జ్‌ చేసుకోవచ్చు. పేటీఎం అంగీకరించే అవుట్‌లెట్లు, మెర్చంట్ల చెల్లింపులు వాడుకోవచ్చని తెలిపింది. 

పేటీఎం వాలెట్‌లోనే నగదును..

కానీ ప్రత్యేకంగా పేటీఎం వాలెట్‌లోనే నగదును యాడ్‌ చేయాలనుకుంటే, ఆ నగదును డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ ద్వారా యాడ్‌చేసుకోవచ్చు'' అని తెలిపింది.

ప్రధాన కారణం..

అయితే పేటీఎం తన పాలసీని తాత్కాలికంగా మార్పు చేయడానికి ప్రధాన కారణం తన ప్లాట్‌ఫామ్‌పై క్రెడిట్‌ కార్డుల దుర్వినియోగమేనని తెలుస్తోంది. 0 శాతం ఫీజులతో పేటీఎం బ్యాంకు సేవలను అందిస్తోంది.

 

వాలెట్‌ రీఛార్జ్‌ ..

చాలా మంది తమ క్రెడిట్‌ కార్డులను వాడుతూనే వాలెట్‌ రీఛార్జ్‌ చేస్తున్నారు. ఈ రీఛార్జ్‌తో నగదును బ్యాంకు అకౌంట్‌లోకి ట్రాన్సఫర్‌ చేయడం, విత్‌డ్రా చేయడం చేస్తున్నారు.

క్రెడిట్‌ కార్డు ద్వారా డైరెక్ట్‌గా..

అయితే ఒకవేళ క్రెడిట్‌ కార్డు ద్వారా డైరెక్ట్‌గా నగదును విత్‌డ్రా చేస్తే, బ్యాంకును బట్టి ట్రాన్సాక్షన్‌ ఫీజు 2-3 శాతం వసూలు చేస్తున్నారు. ఇలా ఎలాంటి ఫీజులు లేకపోవడంతో, పేటీఎంలో క్రెడిట్‌ కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోంది.వాలెట్‌ రీఛార్జ్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Paytm rolls back feature that turned wallet recharge via credit card into vouchers More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot