OTP అవసరం లేకుండా paytmలో పెమెంట్స్

|

ఇండియా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టినప్పటి నుండి డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోను paytm ద్వారా లావాదేవీలు జరపడం చాలా ఎక్కువగా ఉన్నాయి. paytmలో పెమెంట్స్ చేసేటప్పుడు ప్రతిసారి వన్-టైమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకొక్క సారి
ఈ పాస్వర్డ్ రావడం ఆలస్యం అవుతుంది. దాని కారణంగా పెమెంట్స్ చేయడానికి చాలా మంది ప్రత్యాన్మాయం చూస్తున్నారు.

 

Paytm

ఇప్పుడు Paytm లో రూ .2,000 లోపు లావాదేవీలను కార్డు ద్వారా చెల్లించడానికి OTP అవసరం లేకుండా ఉండే కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ పని చేస్తుంది. Paytm సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం చెల్లింపుల చేస్తున్నపుడు OTP కోసం వేచి ఉండవలసిన అవసరాన్ని ఇప్పుడు తొలగించింది.

 

గూగుల్ పేలో లక్ష రూపాయలు పొందే మీ అదృష్టానికి మరో అవకాశంగూగుల్ పేలో లక్ష రూపాయలు పొందే మీ అదృష్టానికి మరో అవకాశం

వన్-టైమ్ పాస్వర్డ్
 

వన్-టైమ్ పాస్వర్డ్

సాధారంగా ఏదైనా పెమెంట్స్ చేసేటప్పుడు వన్-టైమ్ పాస్వర్డ్ అనేది రక్షణ పొరగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది కూడా చాలా గజిబిజిగా ఉంటుంది. ఆన్‌లైన్ పెమెంట్స్ చేసేటప్పుడు చాలా రకాల సూచనలు మరియు కనెక్షన్ సమయం ముగిసే సమస్యలు చాలా కష్టంగా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ మొత్తం పెమెంట్స్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని భారతీయ ఇ-కామర్స్ పెమెంట్స్ వ్యవస్థ భావిస్తుంది.

 

Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!Mi పే యాప్: మొదటి సారి గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యత!!!!

ఇది ఎలా పనిచేస్తుంది

ఇది ఎలా పనిచేస్తుంది

Paytm వినియోగదారులు ప్రస్తుత కాలంలో పెద్ద సంఖ్యలో వారి రోజువారీ పెమెంట్స్ లో 2,000 రూపాయల కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారు. అటువంటి వినియోగదారులు OTP కోసం వేచి ఉండకుండా మరియు మరొక దారి చూసుకోకుండా ఉండటానికి సంస్థ ఈ క్రొత్త ఫీచర్ ను పరిచయం చేస్తోంది. ఈ సర్వీస్ ను పొందటానికి Paytm వినియోగదారులు వారు సేవ్ చేసిన కార్డును ఉపయోగించవచ్చు. అలాగే ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో Paytm సేవలను ఉపయోగిస్తున్నప్పుడు తక్షణ చెల్లింపుల కోసం కొత్త కార్డును కూడా జోడించవచ్చు. ఈ సర్వీస్ ఉబెర్,జోమాటో, జియో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కూడా పని చేస్తుంది.

 

ట్రూకాలర్ యాప్ లో సరికొత్త గ్రూప్ చాట్ ఫీచర్‌ అదుర్స్......ట్రూకాలర్ యాప్ లో సరికొత్త గ్రూప్ చాట్ ఫీచర్‌ అదుర్స్......

పేటీఎం- ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం

పేటీఎం- ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం

ఈ ఫీచర్‌ను ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులో తీసుకురావడనికి సంస్థ ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యంలోని మైంట్రాతో ఒప్పందం కుదుర్చుకుంది. మిలియన్ల మంది వినియోగదారులు తమకు నచ్చిన పేమెంట్ మోడ్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. డీమోనిటైజేషన్ నుండి పేటీఎం దేశంలో మొబైల్ పేమెంట్ లకు టార్చ్ బేరర్‌గా మారింది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 12 బిలియన్ లావాదేవీలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2018-19లో 5.5 బిలియన్ లావాదేవీలను అలాగే 2017-18లో 2.5 బిలియన్ లావాదేవీలను పూర్తి చేసింది.

 

Paytm వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ను ఎందుకు అందిస్తోందిPaytm వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ను ఎందుకు అందిస్తోంది

పేటీఎం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ సర్వీస్

పేటీఎం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ సర్వీస్

మార్చిలో ప్రారంభించిన పేటీఎం ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఆధారిత సర్వీస్ హాఫ్ మిలియన్ మంది సభ్యులను ఆకర్షించిందని ఒక నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇది 350 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. ఇప్పుడు ఇది మరొక 4-5 నగరాలకు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఈ సర్వీస్ మొబైల్ వాలెట్ల నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వరకు పెమెంట్స్ చేయడానికి అనుమతిని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Paytm To Allow Card Payments With No OTP

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X