ఫోన్‌పేలో చాట్ ఫీచర్‌... వాట్సాప్‌కు పోటీ ఇచ్చేనా....

|

డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వాటిలో ఫోన్‌పే యాప్ ముందు వరుసలో ఉంది. ఇండియాలో చాలా మంది చాటింగ్ కోసం వాట్సాప్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌పేలో కొత్తగా చాట్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఇది తన ప్లాట్‌ఫామ్‌లో పేమెంట్స్ చేయడంతో పాటుగా చాటింగ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నది.

చాటింగ్ ఫీచర్

చాటింగ్ ఫీచర్

ఫోన్‌పేలో ఈ కొత్త ఫీచర్ ను జోడించడంతో యూజర్లు ఇప్పుడు మరొక ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండా మీ యొక్క స్నేహితుల నుండి డబ్బును అభ్యర్థించవచ్చు మరియు చెల్లింపును చేయడంతో పాటుగా చాటింగ్ కూడా చేయవచ్చు.

 

 

Jio సెట్-టాప్ బాక్స్‌లో OTT యాప్ లను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?Jio సెట్-టాప్ బాక్స్‌లో OTT యాప్ లను ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

 

ఫోన్‌పే చాట్ ఫీచర్‌

ఫోన్‌పే చాట్ ఫీచర్‌

ఫోన్‌పేలో చాట్ ఫీచర్‌ను జోడించడంతో వినియోగదారులు మరొకరితో చాటింగ్ చేస్తున్నపుడు వారి స్నేహితులకు ఇప్పుడు డబ్బును పంపడం చాలా సులభం చేస్తుంది. ఫోన్‌పే యాప్ లో యూజర్ యొక్క లావాదేవీలను చాట్ హిస్టరీలో చూపబడుతుంది కావున ఇది చాలా ఆకర్షణీయమైన అనుభవంగా ఉంటుంది అని కో-ఫౌండర్ మరియు CTO రాహుల్ చారి ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

Nokia 5.2 ఫీచర్స్ లీక్... బడ్జెట్ ధరలో పోటీకి సిద్ధం!!!Nokia 5.2 ఫీచర్స్ లీక్... బడ్జెట్ ధరలో పోటీకి సిద్ధం!!!

ఫీచర్

ఫోన్‌పేలో కొత్తగా జోడించిన ఈ ఫీచర్ చాటింగ్ చరిత్రతో పాటు వారి ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

 గ్రూప్ చాట్

రాబోయే వారాల్లో ఫోన్‌పేలో వాట్సాప్ గ్రూప్ చాట్ వంటి ఫీచర్లను కూడా తీసుకురానున్నట్లు రాహుల్ చారి తెలిపారు. ఇది చాట్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. గ్రూప్ చాట్ ఫీచర్ వినియోగదారులకు వారి యొక్క ప్లాట్‌ఫారమ్‌లోని స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి డబ్బును రిక్వెస్ట్ చేయడం / సేకరించడం వంటివి సులభం చేస్తుంది అని చారి తెలిపారు.

 

 

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలుస్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలు

ఆండ్రాయిడ్

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల కోసం వారం క్రితం లాంచ్ చేసిన ఈ ఫీచర్ 185 మిలియన్ ఫోన్‌పే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
PhonePe Introduced New Chat Feature: Here are the Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X