UMANG యాప్ వచ్చేసింది..

|

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న అన్ని సర్వీసులను ఒకే చోట పొందేందుకు వీలుగా సరికొత్త మొబైల్ యాప్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఉమంగ్ (యునిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

PM launches new mobile app UMANG

ఈ సింగిల్ మొబైల్ అప్లికేషషన్‌లో 162కు పైగా ప్రభుత్వ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే మరిన్ని సర్వీసులు ఈ యాప్‌లో చేర్చే అవకాశం ఉంది. 13 ప్రాంతీయ భాషలను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న 1200 పై చిలుకు సర్వీసులను ఈ యాప్ ద్వారా త్వరలో పొందే వీలుంటుంది.

ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యపిల్ ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ స్టోర్ నుంచి, విండోస్ ఫోన్ యూజర్లు విండోస్ స్టోర్‌ల నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఉమాంగ్ యాప్ ద్వారా బిల్లు చెల్లింపులు, ఆదాయ పన్ను ఫైలింగ్, గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్ చెక్, ఆధార్ అనుసంధానం వంటి సేవలను పొందవచ్చు.

మెసెంజెర్‌లో దాగిన 4 రహస్యాలు తెలుసుకోండిమెసెంజెర్‌లో దాగిన 4 రహస్యాలు తెలుసుకోండి

సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు అత్యాధునిక టెక్నాలజీతో పాటు సాధాన సంపత్తిని మెరుగుపర్చుకోవాలని సూచించారు. డిజిటల్ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోన్న నేపథ్యంలో సైబర్ స్పేస్‌కు మరింత భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
The new app provides access to 1200+ services of various government services from Centre, State and utility services and it supports 13 Indian languages

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X