మహిళల కోసమై ప్రత్యక డేటింగ్ యాప్ ను షురూ చేసిన బాలీవుడ్ భామ
మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ బంబల్‌లో త్వరలోనే భారతదేశంలో ప్రారంభం కానుంది .
మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ బంబల్ త్వరలోనే భారతదేశంలో ప్రారంభం కానుంది .ప్రత్యకంగా యువతులు, మహిళల కోసం రూపొందించిన డేటింగ్ యాప్ బంబల్‌లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటికే టెక్ స్టార్ట్‌అప్ హోల్బెర్టన్ స్కూల్లో పెట్టుబడిదారుగా ఉన్న బాలీవుడ్ భామ ప్రియాంక సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో పెట్టుబడిదారుగా, సలహాదారుగా ఇపుడు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
ట్విట్టర్ ద్వారా షేర్ ...
మహిళల మొట్ట మొదటి సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ బంబల్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు చాల సంతోషంగా ఉంది అని ప్రియాంక చోప్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

2017 అక్టోబర్‌లో బంబుల్ డేటింగ్ యాప్ స్థాపించారు....
2017 అక్టోబర్‌లో బంబుల్ డేటింగ్ యాప్ విట్నే వోల్ప్ హెర్డ్ స్థాపించారు. ఇప్పటికే 160 దేశాలలో పనిచేస్తున్న బంబుల్, ఫోటో వెరిఫికేషన్ ఫీచర్ ఆధారితంగా పనిచేస్తుంది.

మహిళల భద్రతకు ప్రాధాన్యత...
ఈ యాప్ లో మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలిపారు. ఉదాహరణకు, మహిళలు వారి పూర్తి పేర్లకు బదులుగా తమ ప్రొఫైల్లో కేవలం ఫస్ట్ లెటర్ ఉపయోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది.

27 మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తుండగా....
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 27 మిలియన్ల మంది ఈ యాప్‌ను వినియోగిస్తుండగా, దాదాపు 4000 కంటెంట్ మోడరేటర్లతో ఫోటోలను, ప్రొఫైల్స్‌ను నిరంతరం రివ్యూ చేస్తుంది.

ఈ ఏడాది చివరి నాటికి...
ఈ ఏడాది చివరి నాటికి భారతీయ మహిళలకు అందుబాటులోకి రానున్న బంబుల్ హిందీ,ఇంగ్లీష్ భాషల్లో లాంచ్‌కానుంది. ఆండ్రాయిడ్, యాపిల్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫాంలపై ఇది పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








