'దయచేసి వినండి.. రైల్వే సూపర్ యాప్ SwaRail బీటా వెర్షన్ వచ్చేసింది'
ఇండియన్ రైల్వేలో ఇటీవల కాలంలో మౌలిక సదుపాయాలతోపాటు కనెక్టివిటీ మెరుగుపరించింది. ఫలితంగా దేశంలోని అత్యధిక ప్రాంతాలకు కనెక్టివిటీని కలిగి ఉంది. మరియు రోజుకు కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. టికెట్ బుకింగ్ సిస్టమ్‌లో గతంతో పోలిస్తే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ టికెట్లు రిజర్వేషన్ చేసుకొనే అవకాశం వచ్చింది. IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ద్వారా సులభంగా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. గతంలో 120 రోజుల ముందు వరకు టికెట్లు బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండగా.. ఇటీవల ఆ గడువును 60 రోజులకు కుదించింది. అయితే ప్రస్తుతం రైల్వేలో వివిధ సర్వీసుల కోసం వేర్వేలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఎవరు అభివృద్ధి చేశారు :
అన్ని సర్వీసులను ఒకే యాప్ కిందకు తీసుకొచ్చేందుకు రైల్వే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ రైల్వే సూపర్ యాప్ "SwaRail" ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేసింది. గత నెలలోనే ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తారని భావించారు. అయితే తాజాగా ఈ యాప్ గురించి కీలక సమాచారం వెల్లడయింది.

త్వరలో 10 వేల మందికి :
రైల్వే సూపర్ యాప్ స్వరైల్ బీటా టెస్టింగ్ కోసం విడుదల చేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించింది. అయితే తొలిదశలో 1,000 మందికి మాత్రమే డౌన్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. వారిచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 10,000 మంది డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కల్పిస్తామని తెలిపింది.
క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ :
ఈ SwaRail యాప్ ద్వారా రైల్వే అన్ని సర్వీసులను ఒకే చోటుకు చేర్చడం సహా యూజర్‌లకు మెరుగైన సర్వీసులను అందించడం లక్ష్యమని రైల్వో బోర్డు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. ఈ సూపర్ యాప్ క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ను అందిస్తుందని చెప్పారు.
ప్రస్తుతం వేర్వేరు ప్లాట్‌ఫాంలు :
ప్రస్తుతం రైల్వే టికెట్ల బుకింగ్ కోసం IRCTC రైల్ కనెక్ట్ యాప్ (IRCTC Rail Connect), అన్ రిజర్వడ్, ప్లాట్‌ఫాం టికెట్ల కోసం UTS (అన్ రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్), ఫిర్యాదులు, ఫీడ్‌బ్యాక్ కోసం రైల్ మదద్ (Rail madad App), ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ ఫుడ్ ఆన్ ట్రాక్, ట్రైయిస్ ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైయిన్ ఎంక్వైరీ సిస్టమ్, PNR కోసం వేర్వేరు ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉన్నాయి.
గత నెలలోనే ఇంటిగ్రేషన్ :
అయితే రైల్వే ప్రయాణికులు వివిధ అవసరాల కోసం ఈ యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సర్వీసులు అన్నీ త్వరలో సూపర్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ యాప్ బీటా టెస్టింగ్ దశలో అందుబాటులో ఉంది. గత నెలలో సూపర్ యాప్ ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ తో ఇంటిగ్రేట్ చేసే ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిసింది.
ఆండ్రాయిడ్, iOS యూజర్‌ల కోసం అందుబాటులోకి :
ప్రస్తుతం రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకొనేందుకు ఉపయోగిస్తున్న IRCTC రైల్ కనెక్ట్ యాప్ సుమారు 100 మిలియన్ డౌన్‌లోడ్ లను కలిగి ఉంది. త్వరలో అందుబాటులోకి రానుందని భావిస్తున్న సూపర్ యాప్ ఆండ్రాయిడ్, iOS యూజర్‌లకు విడుదల కానుందని తెలుస్తోంది. అయితే కచ్చితమైన తేదీ వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications








