Paytm యొక్క UPI ట్రాన్సాక్షన్లను అనుమతించాలని NPCI ని కోరిన RBI ! వివరాలు
Paytm పై RBI కఠిన చర్యల తర్వాత, సంస్థ ఇప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా మారడానికి అధికారికంగా One 97 కమ్యూనికేషన్స్ అని పిలువబడే Paytm నుండి వచ్చిన అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రతిపాదన అభ్యర్థన ఆమోదించబడినట్లైతే, ఇది భారతదేశంలోని ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా చెల్లింపులను చేయడానికి Paytm ని మళ్ళీ అనుమతిస్తుంది. అయితే ఈ యాప్‌ను సపోర్ట్ చేయడానికి కొత్తగా గుర్తించబడిన ఏదైనా బ్యాంకు నుంచి సేవలు అవసరం అవుతాయి.

అధిక మొత్తంలో UPI చెల్లింపులను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో, Paytmకి సర్వీస్ ప్రొవైడర్‌లుగా వ్యవహరించడానికి NPCI నాలుగు నుండి ఐదు బ్యాంకులను సులభతరం చేయాలని RBI శుక్రవారం తెలిపింది.
"ఇప్పటికే ఉన్న వినియోగదారులందరూ కొత్త హ్యాండిల్‌కి సంతృప్తికరంగా మారే వరకు, ఈ TPAP ద్వారా కొత్త యూజర్లు ఎవరూ జోడించబడరు" అని RBI తెలిపింది.
గత నెలలో, సెంట్రల్ బ్యాంక్ Paytm యొక్క అసోసియేట్ అయిన Paytm పేమెంట్స్ బ్యాంక్‌ని మార్చి 15 లోపు తన వ్యాపారాన్ని ముగించమని కోరింది. ఇది బ్యాంకింగ్ యూనిట్‌ను వేరుగా ఉపగోగించడం కారణంగా ప్రముఖ చెల్లింపు యాప్‌కు అంతరాయం కలిగించింది.
NPCI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, Paytm దేశంలో UPI చెల్లింపుల కోసం అందుబాటులో ఉన్న మూడవ అతిపెద్ద యాప్, 1.6 బిలియన్ నెలవారీ లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. PhonePe మరియు Google Pay లు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి.
Paytm QR కోడ్‌లను అమలు చేయడానికి, కంపెనీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులతో సెటిల్‌మెంట్ ఖాతాలను తెరవవచ్చని RBI తెలిపింది. బ్యాంకింగ్ భాగస్వామిగా వ్యవహరించేందుకు యాక్సిస్ బ్యాంక్ తో ఒప్పందంపై సంతకం చేసినట్లు పేటీఎం గత వారం తెలిపింది.
Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై నిషేధం గడువు పొడిగించారు, గడువు తర్వాత UPI సేవలు పని చేస్తూనే ఉంటుందా లేదా అనే గందరగోళం ఇప్పటికీ ఉంది. దీనికి సంబందించి, Paytm తన వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన పోస్ట్ చేసింది. మార్చి 15 తర్వాత వాలెట్, ఫాస్టాగ్ మరియు మరిన్నింటికి సంబంధించి ఏ యే సేవలు పనిచేస్తాయి మరియు ఏ యే సేవలు పనిచేయవు. మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం ఇక్కడ ఉంది.
మీరు రీఛార్జ్‌లు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి మరియు ఇతర పనులకు Paytmని ఉపయోగించడం కొనసాగించగలరా?
ప్రజలు అన్ని బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జ్‌ల కోసం Paytm యాప్‌ని ఉపయోగించడం కొనసాగించవచ్చని కంపెనీ తన తాజా FAQ పేజీని ధృవీకరించింది. Paytm చెల్లింపుల బ్యాంకుపై నిషేధం ICICI, HDFC మరియు ఇతర అధీకృత బ్యాంకులకు తమ Paytmని లింక్ చేసిన వారిపై ప్రభావం చూపదు.
ప్రజలు Paytm ని ఉపయోగించి ఇదివరకు లాగే రీఛార్జ్ చేయగలరు లేదా వారు చేస్తున్న పనులు కొనసాగించగలరు. RBI నిషేధం Paytm పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరిచిన వినియోగదారులపై మాత్రమే ప్రభావం చూపుతుంది.


Click it and Unblock the Notifications