ఇతర దేశాలకు కాల్ చేస్తే నిమిషానికి రూ.1.4 పైసలే!

ఇంటర్నేషనల్ కాలింగ్‌ను మరింత సులభతరం చేస్తూ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన రిలయన్స్ కాల్ గ్లోబల్ సర్వీస్ సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. RGC India పేరుతో లాంచ్ అయిన ఈ యాప్ ద్వారా యూజర్లు ఇంటర్నేషల్ కాల్స్‌ను మరింత నాణ్యతతో చౌక రేట్లలో పొందే అవకాశాన్ని కల్పించారు.

Read More : 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డైరెక్ట్ డైలింగ్ ఫీచర్ సదుపాయం..

ఈ యాప్‌లో ఏర్పాటు చేసిన డైరెక్ట్ డయిలింగ్ ఫీచర్ ద్వారా ఏ విధమైన టోల్ ఫ్రీ లేదా పిన్ నెంబర్‌లను ఎంటర్ చేయకుండా ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు.

రూ.200 విలువ చేసే టాక్‌టైమ్‌ ఉచితం..

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ఈ సర్వీసును ఉపయోగించుకునే వారికి రూ.200 విలువ చేసే టాక్‌టైమ్‌ను యూజర్లకు అందిస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ ప్లే స్టోర్ ద్వారా..

RGC సర్వీసును ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో పొందే క్రమంలో RGC India యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందవల్సి ఉంటుంది. ఐఫోన్ యూజర్లు iOS యాప్ స్టోర్ ద్వారా సర్వీసును యాక్టివేట్ చేసుకోవచ్చు.

నిమిషానికి రూ.1.4 పైసలు

సైనప్ ఛార్జీల క్రింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. కాల్ ఛార్జీల క్రింద నిమిషానికి రూ.1.4 పైసలు చొప్పున వసూలు చేస్తారు.

అందరికి అందుబాటులో ఉంటుంది..

దేశంలోని అన్ని మొబైల్ ఫోన్ అలానే ల్యాండ్-లైన్ యూజర్లకు తమ రిలయన్స్ గ్లోబల్ కాల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ కన్స్యూమర్ బిజినెస్ సీఈఓ గురుదీప్ సింగ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 200 డెస్టినేషన్‌లకు..

RGC India యాప్ ద్వారా యూజర్లు యూఎస్, యూకే, కెనడా, యూఏఈతో పాటు 200 డెస్టినేషన్‌లకు తక్కువ బడ్జెట్‌లో కాల్స్ చేసుకోవచ్చని ఆర్‌కామ్ స్పష్టం చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
RCom launches international calling app. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting