వాట్సాప్‌లో ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఆటాడుకోవచ్చు..!
WhatsApp Messages: టెక్నాలజీ పెరిగిపోయాక కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిందో.. కొన్ని విషయాలు దాచడం కూడా అంతే కష్టమైపోయింది. వాట్సాప్ సంగతే చూడండి. మెసేజ్ చూస్తే చాలు బ్లూ టిక్స్ పడిపోతాయి, అవతలి వాళ్లకి మీరు మెసేజ్ చూసేశారని తెలిసిపోతుంది. ఒక్కోసారి వెంటనే రిప్లై ఇవ్వాలని ఉండదు, కానీ మెసేజ్ చూసినట్టు అవతలి వాళ్లకి తెలిస్తే ఇబ్బందికరమే. అదృష్టం ఏంటంటే.. వాట్సాప్ మనకి రీడ్ రిసీప్ట్స్ డిసేబుల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చింది.
అంతేకాదు, బ్లూ టిక్స్ పడకుండా మెసేజ్ చదవడానికి ఒక సూపర్ సింపుల్ ట్రిక్ కూడా ఉంది. వీటిని ఫాలో కావడం చాలా సులభం. ఎవరైనా సరే ఈ ట్రిక్స్ ప్రయత్నించి తమ ఫ్రెండ్స్‌తో ఆడుకోవచ్చు. అంటే మీరు వాట్సాప్‌లోకి వచ్చినట్టు, అలాగే మెసేజ్‌లు చదివినట్టు తెలియకుండా జాగ్రత్త పడొచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏవో చూద్దాం.

ట్రిక్ 1: ఎయిర్‌ప్లేన్ మోడ్ మాయ
మెసేజ్ చూసినా అవతలి వాళ్లకి తెలియకుండా ఉండాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్ వాడటం ఒక బెస్ట్ ట్రిక్. దీని ట్రై చేయడానికి ముందుగా మీకు వాట్సాప్ మెసేజ్ రాగానే వెంటనే యాప్ ఓపెన్ చేయవద్దు. కొన్ని సెకన్లు ఆగాలి. ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ కిందకి లాగి ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయాలి.
ఇలా చేస్తే ఫోన్ ఇంటర్నెట్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చదవాలి. మీ ఫోన్ ఆఫ్లైన్‌లో ఉండటం వల్ల, మీరు మెసేజ్ చూసినట్టు వాట్సాప్ అవతలి వాళ్లకి చెప్పదు. సైలెంట్‌గా పని కానిచ్చేస్తుంది. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆఫ్ చేసే ముందు వాట్సాప్ యాప్ పూర్తిగా క్లోజ్ చేయండి.
రీసెంట్ యాప్స్ మెనూ ఓపెన్ చేసి వాట్సాప్ పైకి స్వైప్ చేసి యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయినట్లయితే మీ యాక్టివిటీ మొత్తం వాట్సాప్ గమనిస్తుంది. మీరు మెసేజ్‌లు చదివారన్నట్లు గుర్తించి బ్లూ టిక్ పెడుతుంది.
వాట్సాప్ క్లోజ్ చేశాక ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆఫ్ చేసి ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వాలి. యాప్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీరు మెసేజ్ చదివారు కాబట్టి, అవతలి వాళ్లకి బ్లూ టిక్స్ కనిపించవు. కానీ, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఉండగా వాట్సాప్ ఓపెన్ చేస్తే బ్లూ టిక్స్ పడిపోతాయి. అలా జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ ట్రిక్ ఫాలో అవ్వాలి.
* ట్రిక్ 2: రీడ్ రిసీప్ట్స్ ఆఫ్ చేస్తే ఇక టెన్షనే లేదు
వాట్సాప్ రీడ్ రిసీప్ట్స్ పర్మనెంట్‌గా టర్న్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇది ఎనేబుల్ చేస్తే ఇక బ్లూ టిక్స్ అనేవే ఉండవు. మీరు మెసేజ్ చదివినా అవతలి వాళ్లకి తెలియదు. దీనికి ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌కి వెళ్లాలి. ప్రైవసీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
కిందికి స్క్రోల్ చేస్తే రీడ్ రిసీప్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న టోగుల్ ఆఫ్ చేయాలి. అంతే, ఇప్పుడు మీరు మెసేజ్‌లు చదివినా అవతలి వాళ్లకి బ్లూ టిక్స్ కనిపించవు. కానీ రీడ్ రిసీప్ట్స్ ఆఫ్ చేస్తే, మీరు పంపిన మెసేజ్‌లు అవతలి వాళ్లు చదివితే మీకూ బ్లూ టిక్స్ కనిపించవు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
* ఎక్స్‌ట్రా టిప్స్
నోటిఫికేషన్స్‌లో ప్రివ్యూ: వాట్సాప్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్ బార్‌లో మెసేజ్‌లు చదవొచ్చు. ఇలా చేస్తే కూడా అవతలి వాళ్లకి మీరు మెసేజ్ చూసినట్టు తెలియదు. ఇది చాలా సింపుల్ ట్రిక్. వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి ఉంటే, చాట్ ప్రివ్యూలో మెసేజ్‌లు చదవొచ్చు. కాన్వర్జేషన్ ఓపెన్ చేయకుండానే మెసేజ్ చదివేయొచ్చు.
వాట్సాప్ సెట్టింగ్స్‌లో పాప్-అప్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకుంటే యాప్ ఓపెన్ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు ప్రైవేట్‌గా మెసేజ్‌లు చదువుతూ, ఎప్పుడు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ట్రిక్స్ వాడి మీ ఫ్రెండ్స్‌తో కాస్త ఆటాడుకోవచ్చు.


Click it and Unblock the Notifications








