Realme PaySa యాప్‌తో ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లోకి రియల్‌మి
షియోమి యొక్క Mi క్రెడిట్‌కు రియల్‌మి సమాధానంగా రియల్‌మి పేసా యాప్‌ను ఇండియాలో ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి ఫుల్-స్టాక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌గా క్లెయిమ్ చేయబడిన రియల్‌మి పేసా దేశంలోని వ్యక్తిగత వినియోగదారులకు మరియు చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SME) లావాదేవీలను ఇప్పుడు మరింత సులభతరం చేయడానికి రూపొందించబడింది.

రియల్‌మి పేసా ప్లాట్‌ఫామ్ ద్వారా అనేక రకాల ఆర్థిక సేవలను ప్రారంభించడానికి చైనా కంపెనీ ఒప్పో యాజమాన్యంలోని ఫిన్‌టెక్ స్టార్టప్ ఫిన్‌షెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్రీ క్రెడిట్ రిపోర్ట్, స్క్రీన్ ఇన్సూరెన్స్ మరియు వ్యక్తిగత రుణాలు వంటి లక్షణాలతో రియల్‌మి పేసా యొక్క ఆండ్రాయిడ్ యాప్ ను కూడా ప్రవేశపెట్టింది.

"ఇది పెమెంట్స్ లేదా పెట్టుబడులు అయినా రియల్‌మి పేసా యాప్ పూర్తి రక్షణతో పాటు అన్ని రకాల లావాదేవీల ఎంపికలను అందిస్తుంది" అని రియల్‌మి ఇండియా CEO మాధవ్ శేత్ న్యూ డిల్లీలో జరిగిన రియల్‌మి ఎక్స్ 2 లాంచ్ ఈవెంట్ లో రియల్‌మి పేసా యాప్ గురించి మరియు దాని ప్లాట్‌ఫామ్ గురించి ప్రకటించారు. ఇప్పుడు రియల్‌మి కస్టమర్లకు ఆర్థిక సేవలను మరింత సులభతరం చేయడమే మా లక్ష్యం అని ఆయన తెలిపారు.

రియల్‌మి పేసా సర్వీస్ ద్వారా వినియోగదారులకు డబ్బులను ఇవ్వడం, పొదుపు చేయడంతో పాటుగా అప్పులను కూడా అందిస్తుందని షెత్ తెలిపారు. వ్యక్తిగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మార్కెట్లో మరింత డీప్ గా ఉండటానికి SME లకు రియల్‌మి తన స్థానిక వేదికను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటివరకు వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయబడిన Mi క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌కి కాస్త భిన్నంగా ఉంటుంది.

వినియోగదారులకు మరియు SME లకు ఆర్థిక సేవలను అందించే మొట్టమొదటి మొబైల్ ఫోన్ సంస్థ రియల్‌మి. చిన్న వ్యాపారాలు భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగంగా ఉన్నారని మేము దానిని బాగా అర్థం చేసుకున్నాము "అని రియల్‌మి ఎగ్జిక్యూటివ్ అన్నారు.

రియల్‌మి పేసా యాప్ గురించి తన వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే వివరాల ప్రకారం రియల్‌మి తన కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా క్రెడిట్ రిపోర్టులను అందించడానికి క్రెడిట్ మాంట్రితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రూ.50 వేల మధ్య పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ.8,000 నుండి 1 లక్ష వరకు Mi క్రెడిట్ సర్వీస్ ద్వారా షియోమి పర్సనల్ లోన్ అందిస్తుంది.

రియల్‌మి అదనంగా ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌తో కలిసి రియల్‌మి పేసా ప్లాట్‌ఫామ్ ద్వారా మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ ను సంవత్సరానికి రెండు క్లెయిమ్‌లతో అందిస్తుంది. వ్యాపారాలు కూడా కొత్త ప్లాట్‌ఫాం లెండింగ్‌కార్ట్ ద్వారా రూ.50,000 నుండి 20 లక్షల వరకు పొందవచ్చు. గూగుల్ ప్లే నుండి నేరుగా రియల్‌మి పేసా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని దాని ప్లాట్‌ఫాం ద్వారా అది అందించే ఆర్థిక సేవలను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








