Home
Apps

రూ. 37 వేల కోట్లు వదిలేసి రూ.260 కోట్ల కోసం పాకులాడుతున్న బ్యాంకులు

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్‌)కు రుణం ఇచ్చిన బ్యాంకులు వంతన ఎందుకు పాడుతున్నాయో తెలపాలని నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులను హెచ్చ

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు (ఆర్‌కామ్‌)కు రుణం ఇచ్చిన బ్యాంకులు వంతన ఎందుకు పాడుతున్నాయో తెలపాలని నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులను హెచ్చరించింది. అసెట్స్‌ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ఈ బ్యాంకులు తప్పుడు అభిప్రాయం కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్‌ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వాటికి అక్షింతలు వేసింది.

రూ. 37 వేల కోట్లు వదిలేసి రూ.260 కోట్ల కోసం పాకులాడుతున్న బ్యాంకులు

పూర్తి వివరాల్లోకెళితే..

రూ. 37,000 కోట్లు

రూ. 37,000 కోట్లు

రిలయన్స్‌ జియోకి అసెట్స్‌ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్‌కామ్‌ ఇంతకు ముందు తెలిపిన సంగతి అందరికీ విదితమే. దానికి ఈ బ్యాంకులు కూడా తందానా అన్నాయి. భవిష్యత్ అంతా బంగారంమయం అవుతుందని ేనిపోని భ్రమలు కల్పించాయి. తీరా చూస్తే అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు.

బ్యాంకులపై కన్నెర్ర

బ్యాంకులపై కన్నెర్ర

ఈ కేసులో నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులను తీవ్రంగా మందలించింది. అసెట్స్‌ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టుకుంటామని చెబితే ఇప్పుడు కేవలం రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్‌ చేసుకునేందుకు తంటాలు పడటమేంటని ప్రశ్నల వర్షం కురిపించింది.

బ్యాంకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు

బ్యాంకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు

ఈ వ్యవహారంలో జాయింట్‌ లెండర్స్‌ ఫోరమ్‌ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ కడిగేసింది.

ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ..

ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ..

టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్‌కామ్‌ అధినేత అనిల్‌ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్‌ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌కామ్‌ ఆశ్రయించింది.

ఎరిక్సన్‌కి ఇవ్వాల్సిన బాకీలను

ఎరిక్సన్‌కి ఇవ్వాల్సిన బాకీలను

తమకు చెందాల్సిన నిధులతో ఎరిక్సన్‌కి ఇవ్వాల్సిన బాకీలను ఆర్‌కామ్‌ తీరుస్తానంటే కుదరదని తెగేసి చెప్పాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్‌కు చెల్లించడం కోసం రిటెన్షన్, ట్రస్ట్‌ ఖాతాలో ఉన్న ఐటీ రిఫండ్‌ నిధులను ఉపయోగించుకునేలా అనుమతించాలంటూ ఆర్‌కామ్‌ వేసిన పిటీషన్‌పై మళ్లీ విచారణ కొనసాగింది.

బాకీల భారాన్ని ఆర్‌కామ్‌ బ్యాంకులపై

బాకీల భారాన్ని ఆర్‌కామ్‌ బ్యాంకులపై

ఈ సందర్భంగా బ్యాంకుల తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదించారు. ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే రిటెన్షన్, ట్రస్ట్‌ ఖాతా ఏర్పాటైందని, దానికి, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఎరిక్సన్‌ బాకీల భారాన్ని ఆర్‌కామ్‌ బ్యాంకులపై రుద్దడం కుదరదని తెలిపారు. ఈ సారి కూడా కేసు వాయిదా పడింది

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్‌ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్‌ నిధులను ఆర్‌కామ్‌ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది.దీనికి ప్రతిగా ఐటీ రిఫండ్‌ రూపంలో వచ్చిన రూ. 260 కోట్ల నిధులపై పూర్తి హక్కులు తమకే ఉంటాయని బ్యాంకులు స్పష్టంచేశాయి. ఇదే విషయాన్ని నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌ఏటీ) చెప్పాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Communications Ltd leads losers in 'A' group
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X