Home
Apps

రూ.11కే Jio బూస్టర్ ప్యాక్.. ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

By Lekhaka

ఇండియన్ టెలికం మార్కెట్లో పెను సంచలనం రేపుతోన్న రిలయన్స్ జియో, నిత్యం కొత్త ప్లాన్‌లతో తమ యూజర్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. తాజాగా, బూస్టర్ ప్యాక్స్ పేరుతో 5 సరికొత్త ప్యాక్‌లను జియో

ఇంట్రడ్యూస్ చేసింది. జియో ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ఈ బూస్టర్ ప్యాక్స్ భిన్నంగా ఉంటాయి. వీటిని యాడ్-ఆన్ ప్యాక్స్ క్రింద ఉపయోగించుకోవచ్చు.

jio

మార్కెట్లో రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్రీ-పెయిడ్ ప్లాన్స్ రూ.19 నుంచి రూ.9999 వరకు రకరకాల టారిఫ్‌లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కో ప్లాన్‌కు ఒక్కో రకమైన డేటా లిమిట్‌తో పాటు ఒక్కో విధమైన వ్యాలిడిటీ పిరియడ్‌ను జియో నిర్థేశించటం జరిగింది.

ఉదాహరణకు జియో రూ.309 ప్రీపెయిడ్ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్నట్లయితే డైలీ లిమిట్ క్రింద రోజుకు 1జీబి 4జీ డేటా మనకు లభిస్తుంది. డైలీ లిమిట్ దాటేసిన తరువాత ఇంటర్నెట్ వేగం కాస్తా 128kbpsకు పడిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో డైలీ లిమిట్ క్రాస్ అయిన తరువాత కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీని పొందాలనుకునే వారి కోసం ఈ బూస్టర్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే..

రూ.11 జియో బూస్టర్ ప్యాక్

రూ.11 జియో బూస్టర్ ప్యాక్

రూ.11 చెల్లించి ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను తీసుకోవటం ద్వారా 100MB 4జీ డేటాతో పాటు 35 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

రూ.51 జియో బూస్టర్ ప్యాక్

రూ.51 చెల్లించి ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను తీసుకోవటం ద్వారా 1జీబి 4జీ డేటాతో పాటు 175 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

రూ.91 జియో బూస్టర్ ప్యాక్

రూ.91 చెల్లించి ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను తీసుకోవటం ద్వారా 2జీబి 4జీ డేటాతో పాటు 325 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

 

జియో బూస్టర్ ప్యాక్స్ వ్యాలిడిటీ

జియో బూస్టర్ ప్యాక్స్ వ్యాలిడిటీ

జియో ఆఫర్ చేస్తున్న ఈ బూస్టర్ ప్యాక్‌లను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్టివేట్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్యాక్‌లకు వ్యాలిడిటీ అనేది ఏది ఉండదు. మీ జియో అకౌంట్‌కు సంబంధించి ప్రైమరీ రీఛార్జ్

వ్యాలిడిటీ ముగిసేంత వరకు ఈ ప్యాక్‌లను వాడుకోవచ్చు.

 

జియో బూస్టర్ ప్యాక్‌లను యాక్టివేట్ చేసుకోవటం ఎలా..?

జియో బూస్టర్ ప్యాక్‌లను యాక్టివేట్ చేసుకోవటం ఎలా..?

ముందుగా మీ ఫోన్‌లో జియో యాప్‌ను ఓపెన్ చేసి My Recharge sectionలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే data booster ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా యాడ్-ఆన్ ప్యాక్‌లకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన ప్యాక్‌ను సెలక్ట్ చేసుకుని payment gateway ద్వారా యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio booster packs start from Rs.11: How to recharge, validity and more. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X