జియో బ్రౌజర్ యాప్.. ఇది పక్కా లోకల్!
టెలికమ్ దిగ్గజం రిలయన్స్ జియో, స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం ఓ సరికొత్త అప్లికేషన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియో బ్రౌజర్ యాప్ పేరుతో ఈ అప్లికేషన్ లభ్యమవుతోంది.
టెలికమ్ దిగ్గజం రిలయన్స్ జియో, స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం ఓ సరికొత్త అప్లికేషన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. జియో బ్రౌజర్ యాప్ పేరుతో ఈ అప్లికేషన్ లభ్యమవుతోంది. ఈ సరికొత్త ఇంటర్నెట్ బ్రౌజింగ్ యాప్‌లో పలు విప్లవాత్మక ఫీచర్లను జియో పొందుపరిచింది. జియో బ్రౌజర్ యాప్ యాప్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జియో బ్రౌజర్ యాప్‌ను
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచిన జియో బ్రౌజర్ యాప్‌ను ఇప్పటికే 10 లక్షలకు పై ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ రన్ అవటానికి ఎటువంటి జియో కనెక్షన్ అవసరం ఉండదు. కాబట్టి, ఈ యాప్ జియో యూజర్లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ కాదు. ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ కూడా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతానికైతే జియో బ్రౌజర్ యాప్ ఐఫోన్ యూజర్లకు అందుబాటులో లేదు. ఐఓఎస్ వెర్షన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనేదాని పై కూడా ఓ స్పష్టత లేదు.

రిలయన్స్ జియో
రిలయన్స్ జియో చెబుతోన్న దాని ప్రకారం జియో బ్రౌజర్ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ఇండియన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని అభివృద్థి చేసారు. జియో బ్రౌజర్ యాప్ మొత్తం 8 భాషలను సపోర్ట్ చేస్తుంది. వాటి వివరాలు.. తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ. యూజర్లు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా కావల్సిన భాషను మార్చుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ యాప్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించదు. యాప్ సైజ్ కేవలం 4.5ఎంబి మాత్రమే.

జియో బ్రౌజర్ యాప్ హోమ్ పేజీ పై
జియో బ్రౌజర్ యాప్ హోమ్ పేజీ పై పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఇంకా టెక్నాలజీలకు సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఈ యాప్‌లో న్యూస్ అప్‌డేట్‌లకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో సెక్షన్‌ను కూడా అందుబాటులో ఉంచారు.

జియో బ్రౌజర్ యాప్ ద్వారా
జియో బ్రౌజర్ యాప్ ద్వారా తమ చుట్టు ప్రక్కల జరిగే లోకల్ న్యూస్ అప్‌డేట్‌లను కూడా తెలుసుకునే వీలుంటుంది. ఇందుకు గాను లోకల్ న్యూస్ క్యాటగిరీని సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ యాప్ ప్రయివేట్ బ్రౌజింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ప్రయివేటు బ్రౌజింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్స్ తరహాలోనే
ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్స్ తరహాలోనే జియో బ్రౌజర్‌లో కూడా పేజీలను బుక్‌మార్క్ చేసుకునే వెసలబాటు ఉంటుంది ఇదే సమయంలో నచ్చిన లింక్స్‌ను కూడా వివిధ సోషల్ మీడియా ఛానల్స్‌లో షేర్ చేసుకోవచ్చు.

జియో బ్రౌజర్ యాప్ వాయిస్ ఇన్‌పుట్‌ను
జియో బ్రౌజర్ యాప్ వాయిస్ ఇన్‌పుట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ సపోర్టుతో వాయిస్ కమాండ్స్ ఆధారంగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకునే వీలుంటుంది. జియో బ్రౌజర్ యాప్‌లోని టెక్స్ట్ సైజును కావల్సిన విధంగా పెంచుకునే వీలుంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో
స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో హై స్పీడ్ ఇంటర్నెట్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇంటర్నెట్‌కు ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న ఈ వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేసుకునేందుకు ఎన్ని రకాల బ్రౌజర్లు ఎదురుచూస్తున్నాయి. సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త వర్షన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications








