Paytmలో జియో రీఛార్జ్ ప్లాన్స్, డిస్కౌంట్స్ కూడా..

జియో‌ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ అలానే జియో‌ప్రైమ్ నెలవారీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి.

|

రిలయన్స్ జియో రీఛార్జ్‌లను ఇక నుంచి Paytm ద్వారా చేసుకోవచ్చు. నిన్న, మొన్నటి వరకు రిలయన్స్ జియోకు సంబంధించిన రీఛార్జ్‌లను పొందాలంటే జియో.కామ్ అలానే జియో అప్లికేషన్స్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి.

Paytmలో జియో రీఛార్జ్ ప్లాన్స్, డిస్కౌంట్స్ కూడా..

రూ.249కే రెండు నెలల పాటు కాల్స్, ఇంటర్నెట్

ఇండియన్ టెలికం మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన జియో దేశవ్యాప్తంగా ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో మనందరికి తెలుసు. ప్రస్తుతానికి Paytm యాప్‌లో జియో‌ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్ అలానే జియో‌ప్రైమ్ నెలవారీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. జియో‌ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేసిన యూజర్లకు ప్రత్యేక డిస్కౌంట్లను కూడా పేటీఎమ్ ఆఫర్ చేస్తోంది. పేటీఎమ్ వెబ్‌సైట్ అలానే పేటీఎమ్ మొబైల్ యాప్స్‌లో జియో‌ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్స్‌ను అందుబాటులో ఉంచారు.

మార్చి 1, 2017 నుంచి..

మార్చి 1, 2017 నుంచి..

జియో‌ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ మార్చి 1, 2017 నుంచి అధికారికంగా ప్రారంభమైంది. మార్చి 31లోపు జియో యూజర్లు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకోవటం ద్వారా ఏప్రిల్ 1, 2017 నుంచి మార్చి 31, 2018 వరకు 'Happy New Year' ఆఫర్ తరహాలోనే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

 

రూ.303 చెల్లించటం ద్వారా

రూ.303 చెల్లించటం ద్వారా

ఈ మెంబర్‌షిప్ పిరియడ్‌లో భాగంగా జియో డేటా సేవలను పొందేందుకు నెలకు రూ.303 చెల్లించటం ద్వారా 28జీబి డేటా జియో ప్రైమ్ యూజర్‌కు లభిస్తుంది. ఈ 28జీబి డేటాను రోజుకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి చొప్పున వాడుకోవచ్చు. జియో ప్రైమ్ సభ్యత్వం అనేది మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది.

 

నెలకు రూ.499 చెల్లిస్తూ ఉండటం ద్వారా
 

నెలకు రూ.499 చెల్లిస్తూ ఉండటం ద్వారా

నెలకు రూ.499 చెల్లిస్తూ ఉండటం ద్వారా రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. వాయిస్ కాల్స్‌తో జియో యాప్ సూట్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.

 

అదనపు డేటాను పొందాలనకున్నట్లయితే..

అదనపు డేటాను పొందాలనకున్నట్లయితే..

జియో ప్రైమ్ యూజర్లు అదనపు డేటాను పొందాలనకున్నట్లయితే అదనంగా రూ.51 (1జీబి), రూ.91 (2జీబి), రూ.201 (5జీబి), రూ.301 (10జీబి) బూస్టర్ ప్యాక్‌లను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

రాత్రిళ్లు జియో ఫ్రీ..

రాత్రిళ్లు జియో ఫ్రీ..

జియో ప్రైమ్ యూజర్లు ప్రతి రోజు అర్థరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉచిత 4జీ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. రూ.303 ప్లాన్‌లో భాగంగా రోజుకు 1 జీబి డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం కాస్తా 128 kbpsకు పడిపోతుంది.

విద్యార్థులకు 25% రాయితీ..

విద్యార్థులకు 25% రాయితీ..

విద్యార్థులకు జియో 25% అదనపు 4జీ డేటాతో పాటు ఉచితం వై-ఫై డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ రాయితీని పొందే క్రమంలో విద్యార్ధలు తమ ఐడీ కార్డులను చూపించాల్సి ఉంటుంది.

బూతు చూస్తే బుక్కైపోతారు జాగ్రత్త..?బూతు చూస్తే బుక్కైపోతారు జాగ్రత్త..?

Best Mobiles in India

English summary
Reliance Jio Now Allows You to Recharge via Paytm. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X