జియో యూజర్స్ కోసం JioSecurity

జియో నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లకు సంబంధించి మొబైల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే క్రమంలో రిలయన్స్ జియో, Norton మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో ఓ సరికొత్త యాప్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. JioSecurity పేరుతో విడుదలైన ఈ యాప్ గూగల్ ప్లే స్టోర్ అలానే యాపిల్ యాప్ స్టోర్‌లలో లభ్యమవుతోంది. ఈ యాప్ జియో యూజర్లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది.

Read More : రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Norton మొబైల్ సర్వే ప్రకారం..

తాజాగా విడుదలైన Norton మొబైల్ సర్వే ప్రకారం ఇండియాలోని 36శాతం స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఏ మాత్రం అవగాహన లేకుండా తమ ఫోన్‌లలోని డేటాను యాప్స్ యాక్సెస్ చేసుకునేందుకు పర్మిషన్‌ను గ్రాంట్ చేసేస్తున్నారట. ఈ క్రమంలో చాలా వరకు యాప్స్ యూజర్‌కు తెలియకుండా అతని డేటాను రహస్యంగా తమ సర్వర్లకు చేరవేస్తున్నాయట.

శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లతో..

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు జియో, నోర్టాన్‌లు సంయుక్తంగా అందబాటులోకి తీసుకువచ్చిన జియోసెక్యూరిటీ యాప్ శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. యాప్ సెక్యూరిటీ, మాల్వేర్ స్కానర్, డివైస్ ప్రొటెక్షన్ వంటి శక్తివంతమైన సెక్యూరిటీ ఫీచర్లు జియోసెక్యూరిటీలో ఉన్నాయి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత..

జియో యూజర్లు ముందుగా ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత తమకు కేటాయించబడి జియో ఐడీ ద్వారా యాప్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసస్ పూర్తి అయిన వెంటనే యాప్ administrator permissionsను అడుగుతుంది.

ప్రైవసీ రిస్క్‌ను ఎప్పటికప్పుడు సూచిస్తుంది...

పర్మిషన్ గ్రాంట్ చేసిన వెంటనే ఫోన్ మొత్తాన్ని యాప్ స్కాన్ చేసి ఓ రిపోర్టును అందిస్తుంది. జియోసెక్యూరిటీ యాప్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయటంతో పాటు యాప్స్‌కు సంబంధించిన ప్రైవసీ రిస్క్‌ను సూచిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio partners with Norton to bring a new security app for its users. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot