జియో కాయిన్స్‌ యాప్‌పై క్లారిటీ ఇచ్చిన కంపెనీ, ఎప్పుడు వస్తుంది..?

టెలికాం సంస్థ రిలయన్స్ జియో నూతన క్రిప్టోకరెన్సీని జియో కాయిన్ పేరిట తయారు చేస్తున్నదని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

By Hazarath
|

టెలికాం సంస్థ రిలయన్స్ జియో నూతన క్రిప్టోకరెన్సీని జియో కాయిన్ పేరిట తయారు చేస్తున్నదని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వం వహించనున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంత మాత్రం వాస్తవం లేదని జియో తెలియజేసింది. కంపెనీ లేదా తమకు సంబంధించిన అసోసియేట్స్‌ ఎలాంటి యాప్స్‌ను ఆఫర్‌ చేయడం లేదని ప్రజలకు, మీడియాకు తాము తెలియజేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. జియోకాయిన్‌ పేరుతో వస్తున్న అన్ని యాప్స్‌కు కూడా నకిలీవే అని పేర్కొంది.

 

అంబాని వెనుక దాగిన సైన్యం ఇదే, జియో విజయమంతా ఓ రహస్యాల పుట్ట !అంబాని వెనుక దాగిన సైన్యం ఇదే, జియో విజయమంతా ఓ రహస్యాల పుట్ట !

గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా ..

గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా ..

జియో కాయిన్ పేరిట గూగుల్ ప్లే స్టోర్‌లో కుప్పలు కుప్పలుగా యాప్స్ ఉన్నాయని, అలాగే పలు వెబ్‌సైట్లు కూడా పుట్టుకొచ్చాయని వాటితో జియోకు ఎలాంటి సంబంధం లేదని జియో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్

22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్

జియో పేరుతో యోగ్యత లేని కొంతమంది వ్యక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా మొత్తం గూగుల్ ప్లో స్టోర్ లో 22 రకాల జియో కాయిన్ ఫేక్ యాప్స్ ని గుర్తించారు.

 జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని..
 

జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని..

ఎవరూ కూడా జియో కాయిన్ యాప్స్, సైట్లను నమ్మవద్దని, అనవసరంగా సమస్యల్లో ఇరుక్కోవద్దని జియో హెచ్చరించింది. అయితే భవిష్యత్తులో జియో కాయిన్‌ను విడుదల చేస్తారా లేదా అన్న విషయంపై మాత్రం జియో స్పష్టతనివ్వలేదు.

బిట్‌కాయిన్‌..

బిట్‌కాయిన్‌..

గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో డిజిటల్‌ కరెన్సీకి విపరీతంగా డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో బిట్‌కాయిన్‌ ఎక్కువగా పాపులర్‌ అయింది.

అప్రమత్తంగా ఉండాలని..

అప్రమత్తంగా ఉండాలని..

అయితే ఈ కరెన్సీలకు ఎటువంటి రెగ్యులేటరీలు లేవు. దీంతో వర్చ్యువల్‌ కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే చాలా దేశాలు ఈ క్రిప్టో కరెన్సీని నిషేధించాయి.

 

 

జియో కాయిన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌..

జియో కాయిన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌..

కాగా ఈ మధ్య జియోకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను బట్టి, జియో కాయిన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ఒకటి తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ అనే యూఆర్‌ఎల్‌తో ఈ వెబ్‌సైట్‌ లిస్ట్‌ అయింది. అచ్చం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మాదిరిగేనే ఈ వెబ్‌సైట్‌ దర్శనమిస్తోంది. ఐకాన్‌ కూడా జియో పేరెంట్‌ కంపెనీదే ఉండటం గమనార్హం.

పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌..

పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌..

దీనిలో ఒక్కో జియో కాయిన్‌ను వంద రూపాయలకు లాంచ్‌ చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌తో రిజిస్టర్‌ అవ్వాలంటూ ఈ నకిలీ వెబ్‌సైట్‌ యూజర్లను తప్పుదోవ పట్టించింది.దీనిలో ఏదన్నా సమాచారం రాయడానికి కనీసం వెబ్‌సైటే ఓపెన్‌ అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కూడా.

రిలయన్స్ జియో స్పీడ్ 25.6 mbps, ఇదే అత్యధిక వేగమట !

రిలయన్స్ జియో స్పీడ్ 25.6 mbps, ఇదే అత్యధిక వేగమట !

టెలికాం ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 4జీ నెట్‌వర్క్‌ స్పీడ్‌లో దేశీయ దిగ్గజాలకు సవాల్ విసురుతూ మరోసారి టాప్‌లో నిలిచింది. వరుసగా 11వ సారి కూడా జోరును సాగించిన జియో నవంబర్‌లో నెలలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. తద్వారా ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లకు భారీ నిరాశను మిగిల్చింది.

ఆరంభం నుంచి కస్టమర్లకు ..
ఆరంభం నుంచి కస్టమర్లకు ఆఫర్లను అందించడంలో దూకుడును ప్రదర్శించిన టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ డేటాను అందివ్వడంలో మళ్లీ టాప్‌ లో నిలిచిందనీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా..

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా..

ట్రాయ్ తన మై స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా సేకరించిన గణాంకాల ప్రకారం నవంబరు నెలలో దేశవ్యాప్తంగా ఉన్న టెలికాం సంస్థలు అందించిన డేటా స్పీడ్‌లో జియో మొదటి స్థానంలో నిలిచింది. ట్రాయ్‌ డేటా నవంబరు 2017 నాటికి 25.6 ఎంబీపీఎస్ వేగంతో 4జీ సర్వీసు ప్రొవైడర్ల జాబితాలో రిలయన్స్ జియో మొదటిస్థానంలో నిలిచింది.

 

 

వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్..

వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్..

జియోకు సన్నిహిత ప్రత్యర్థి వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్‌ వేగాన్ని అందించాయి. అప్‌లోడ్‌ వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది.

ఐడియా 6.6 ఎంబీపీఎస్

ఐడియా 6.6 ఎంబీపీఎస్

తరువాతి స్థానాల్లో ఐడియా(6.6 ఎంబీపీఎస్), జియో( 4.9 ఎంబీపీఎస్) నిలిచాయి. ఎయిర్టెల్ 4 ఎంబీపీఎస్‌ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. కాగా జియో ఎప్పటికప్పుడూ తన యూజర్లను పెంచుకుంటూ పోతోంది. అలాగే ఆఫర్లను కురిపిస్తూ దిగ్గజాలను ఎప్పటికప్పూడు మట్టి కరిపిస్తున్న సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
Reliance Jio Says It Didn't Launch a JioCoin App More News telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X