రిలయన్స్ జియో వినియోగదారులకు మరో గుడ్ న్యూస్

టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

|

టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జియో నుంచి అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు రావడం కూడా వినియోగదారులకు పండగ వాతావరణాన్ని కల్పించింది.తక్కువ ధరకే ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేయడమే కాకుండా వారి వినియోగదారులు కోసం JioCinema మరియు JioTV ను లాంచ చేసింది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా JioGroupTalk యాప్ ను ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో, రిలయన్స్ జియో వినియోగదారులు గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ చేయవచ్చు.

శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన Galaxy S10, S10+,S10e ధరలు ఎంతో తెలుసా..?శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన Galaxy S10, S10+,S10e ధరలు ఎంతో తెలుసా..?

ఈ JioGroupTalk యాప్

ఈ JioGroupTalk యాప్

ఈ JioGroupTalk యాప్ ఇప్పటికే Google Play స్టోర్ లో అందుబాటులో ఉంది. జియో వినియోగదారులు వారి జియో నెంబర్ తో సైన్ ఇన్ చేయడం ద్వారా ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. JioGroupTalk యాప్ కొన్ని రోజుల పాటు ట్రయల్ వ్యవధిలో ఉంటుంది.

 నాన్ -జియో యూజర్లతో కూడా కనెక్ట్

నాన్ -జియో యూజర్లతో కూడా కనెక్ట్

జియో యూజర్లు నాన్ -జియో యూజర్లతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం రిలయన్స్ జియో సంస్థ కల్పిస్తుంది.రిపోర్ట్ ప్రకారం సబ్స్క్రైబర్ కాన్ఫెరెన్స్ కాల్ చేస్తునపుడూ కాల్ ను మేనేజ్ చేయడం,కాలర్ ను యాడ్ చేయడం,ఒకర్నిమ్యూట్ చేయడం లేదా గ్రూప్ ను మ్యూట్ చేయడం లేదా కాలర్ ను రీకనెక్ట్ చేయడం వంటి ఆప్షన్స్ ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.

యాప్ లో ‘Lecture’ మోడ్
 

యాప్ లో ‘Lecture’ మోడ్

యాప్ లో ‘Lecture' మోడ్ కూడా ఉంది. ఈ మోడ్ ను ఉపయోగించి ఎవరైనా ఇద్దరు మాట్లాడేటపుడు గ్రూప్ లో సభ్యులు వినకుండా గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ సభ్యులను మ్యూట్ చెయ్యగలరు. ప్రస్తుతం యాప్లో ఆడియో కాల్స్ మాత్రమే పరిమితం చేయబడింది. జియో సంస్థ త్వరలోనే యాప్ కోసం వీడియో కాల్ లేదా గ్రూప్ చాట్ ఫీచర్ ను జోడించనుంది.

ట్రాయ్ లేటెస్ట్ గా

ట్రాయ్ లేటెస్ట్ గా

ట్రాయ్ లేటెస్ట్ గా ఒక నివేదికను విడుదల చేసింది.నివేదిక ప్రకారం రిలయన్స్ జయో మొత్తం 280 మిలియన్ల మంది చందాదారులను కలిగి ఉంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 11.4 కోట్లు. టెలికాం కంపెనీ డిసెంబరు 2018 నాటికి 5.56 లక్షల కస్టమర్లను తన నెట్వర్క్కు జోడించారు. అదే సమయంలో వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ కస్టమర్లను కోల్పోయాయి. వోడాఫోన్ ఐడియా 2.33 మిలియన్ చందాదారులను కోల్పోయింది, ఎయిర్టెల్ డిసెంబర్ 2018 నెలలో వరుసగా 1.5 మిలియన్ల వినియోగదారులను కోల్పోయింది.

 

 

Best Mobiles in India

English summary
Reliance JioGroupTalk app unveiled: All you need to know.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X