Jio కొత్త ఫీచర్, నచ్చిన కంటెంట్ డౌన్‌లోడ్ చేసేయండి
తాజా అప్‌డేట్‌లో భాగంగా ‘Smart Download' పేరుతో కొత్త ఆప్షన్ జియో యాప్స్‌లో యాడ్ అయ్యింది.
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో తన జియో మ్యూజిక్ (Jio Music), జియో సినిమా (Jio Cinema) యాప్‌లను అప్‌డేట్ చేసింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా 'Smart Download' పేరుతో కొత్త ఆప్షన్ యాడ్ అయ్యింది. ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవటం ద్వారా జియో డేటాను మరింతగా ఆదా చేసుకోవచ్చు.

Read More : వాట్సాప్ నుంచి మేజర్ సెక్యూరిటీ అప్‌డేట్
ప్రస్తుతం జియో ఆఫర్ చేస్తోన్న హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా రోజుకు 1జీబి డేటాను మాత్రమే ఉచితంగా వాడుకునే వీలుంది. అయితే రాత్రి 2 గంటల నుంచి ఉదయం 5 గంటలకు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. ఈ సమయంలో మీరు స్మార్ట్ డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోగలిగినట్లయితే కావల్సినంత కంటెంట్‌ను స్మార్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Read More : మీ ఫోన్ వాల్‌పేపర్ గంటగంటకి మారిపోవాలా..?
జియో మ్యూజిక్, జియో సినిమా యాప్‌లలో మీరు ఏదైనా వీడియో లేదా మ్యూజిక్‌ను సెలక్ట్ చేసుకుని డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే Choose When to Download విభాగంలో 'Smart Download' పేరుతో కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

Read More : యూట్యూబ్ గో.. ఇంటర్నెట్ లేకుండా వీడియోలు చూడండి
ఈ ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకున్నట్లయితే డౌన్‌లోడ్ ప్రాసెస్ ఆటోమెటిక్‌గా రాత్రి 2 తరువాత ప్రారంభమవుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్‌లోని LTE dataను ఆన్‌చేసి ఉంచాల్సి ఉంటుంది. జియో రాత్రివేళ అందిస్తోన్న ఉచిత అన్‌లిమెటెడ్ నైట్ డేటాను పూర్తిస్ధాయిలో ఉపయోగించుకునేందుకు ఇదో చక్కటి అవకాశం. 'Smart Download' ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?


Click it and Unblock the Notifications








