ఫోన్‌తో పాటుగా వచ్చే యాప్స్‌ను తొలగించటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువుగా వినియోగించబడుతోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా Bloatware యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదాం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Bloatware యాప్స్‌..

Bloatware యాప్స్ అనేవి ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed Apps. ఈ యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ హ్యాకర్లు సునాయాశంగా ఫోన్‌లలోకి చొరబడి విధ్వంసం సృష్టించే వీలుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పేరుకుపోయి ఉన్న Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు...

స్టెప్ 1

ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉన్న స్టాక్ యాప్స్‌‌ను మీరు మాన్యువల్‌గా రిమూవ్ చేయటం సాధ్యపడదు. కాబట్టి, ముందుగా ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ 2

ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.

స్టెప్ 3

ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు.

స్టెప్ 4

యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి.

స్టెప్ 5

డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో Pre-Installed Appsను మార్క్ చేసుకుని apply బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Remove preinstalled apps without rooting in Android Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot