ఈ 7 పాస్‌పోర్ట్ ఫేక్ యాప్స్‌తో జాగ్రత్త,ఓ సారి చెక్ చేయండి

|

విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్ ఒకటి. విదేశాలకు వెళ్లేందుకు ఈ మధ్య చాలా మంది ఆసక్తి చూపిస్తుండటంతో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వీరిని ఆసరాగా చేసుకుని అనేక రకాలైన నకిలీ వెబ్‌సైట్లు కూడా పుట్టుకొస్తున్నాయి.

 
report 7 fake passport seva look alike aps you should be aware

పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. అందుకే పౌరులను అప్రమత్తం చేస్తోంది.నకిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దని హెచ్చరిస్తోంది.

అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే:

అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే:

పాస్‌పోర్ట్ సేవలు పొందడానికి అధికారిక వెబ్‌సైట్‌ మాత్రమే ఉపయోగించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరుతోంది. ఇందులో భాగంగా నకిలీ వెబ్‌సైట్ల వివరాలను వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ వెబ్‌సైట్లు ఓపెన్ చేయొద్దని, బ్యాంక్ అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని హెచ్చరిస్తోంది. ఈ నకిలీ వెబ్‌సైట్లు .org, .in, .com డొమైన్‌తో ఉంటాయి. ప్రభుత్వ వెబ్‌సైట్ మాత్రం .gov.in డొమైన్‌తో ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన నకిలీ వెబ్‌సైట్లు:

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిన నకిలీ వెబ్‌సైట్లు:

www.indiapassport.org

www.indiapassport.org

www.passport-seva.in

www.online-passportindia.com

www.passportindiaportal.in

www.passport-india.in

www.applypassport.org

 

ప్రయత్నిస్తే నిండా మునగాల్సిందే:
 

ప్రయత్నిస్తే నిండా మునగాల్సిందే:

ఈ వెబ్‌సైట్ల ద్వారా మీరు పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నిస్తే నిండా మునగాల్సిందే. అందుకే ప్రభుత్వ వెబ్‌సైట్ www.passportindia.gov.in ఉపయోగించుకోవాలి. లేదా mPassport Seva మొబైల్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం పాస్‌పోర్ట్ కోసం తీసుకునే ఛార్జీల వివరాలు

ప్రభుత్వం పాస్‌పోర్ట్ కోసం తీసుకునే ఛార్జీల వివరాలు

36 పేజీల కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యువల్- రూ.1500

60 పేజీల కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యువల్- రూ.2000

18 ఏళ్లలోపై మైనర్లకు 36 పేజీల కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యువల్- రూ.1000

36 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్- రూ.3000

60 పేజీల పాస్‌పోర్ట్ రీప్లేస్‌మెంట్- రూ.3500

పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్- రూ.500

పాస్‌పోర్ట్ తత్కాల్‌లో పొందాలంటే అదనంగా రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది.

 

Best Mobiles in India

English summary
report 7 fake passport seva look alike aps you should be aware

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X