జియో తర్వాత రింగో వంతు..టెల్కోలను ఏకిపారేసింది

By Hazarath
|

ఇంటర్నెట్ ద్వారా కాలింగ్ సేవల సదుపాయాన్ని అందిస్తున్న రింగో యాప్ దిగ్గజ టెల్కోలపై మండి పడింది. తమకు దిగ్గజ టెల్కోలు సరైన ఇంటర్ కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదంటూ దుమ్మెత్తిపోసింది. ఇది ఇలానే కొనసాగితే కఠిన చర్యలు తీసుకునేలా ట్రాయ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది.

చైనాకు దిమ్మతిరిగింది :అప్పుడే హెచ్చరికలు మొదలుపెట్టింది

వీడియో కాలింగ్ యాప్ రింగో

వీడియో కాలింగ్ యాప్ రింగో

వీడియో కాలింగ్ యాప్ రింగో తన నెట్‌వర్క్‌కు టెలికం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్ ఇంటర్‌కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేసింది. దీనిపై ఆపరేటర్లకు లేఖలు రాయగా ఎలాంటి స్పందన లేదని, ట్రాయ్‌కు కూడా ఫిర్యాదు చేశామని రింగో సీఈవో భవీన్ తురాఖియా చెప్పారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీఎస్‌ఎన్‌ఎల్ మినహా

బీఎస్‌ఎన్‌ఎల్ మినహా

బీఎస్‌ఎన్‌ఎల్ మినహా మిగిలిన ఆపరేటర్లు ఇంటర్ కనెక్షన్‌కు అవకాశం కల్పించడం లేదన్నారు. విమొబి అనే తమ సబ్సిడరీ ద్వారా ఫిబ్రవరిలో యూనిఫైడ్ లెసైన్స్ తీసుకున్నామని ఆయన తెలిపారు.

ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు

ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు

అయితే ఇంటర్నెట్ టెలిఫోన్ సేవలు ప్రారంభించకుండా ఉంటేనే మా నెట్‌వర్క్‌కు ఇంటర్ కనెక్షన్ కల్పిస్తామని ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌సెల్‌లు చెప్పాయని వివరించారు. కాని అవి మాటమార్చి మమ్మల్ని మోసం చేశాయని తెలిపారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి

వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి

ప్రస్తుతం వాయిస్ కాల్స్‌కు నిమిషానికి 40 పైసల నుంచి రూపాయిన్నర వరకు కంపెనీలు వసూలు చేస్తున్నాయని, తాము 20 నుంచి 35 పైసలకే ఈ కాల్స్ అందిస్తామన్నారు.

కాలింగ్ సేవలను 2015 నవంబర్‌లోనే

కాలింగ్ సేవలను 2015 నవంబర్‌లోనే

వాస్తవానికి రింగో తన చౌక యాప్ కాలింగ్ సేవలను 2015 నవంబర్‌లోనే ప్రారంభించింది. 90 శాతం చౌకగా కాల్స్ అందిస్తుండడంతో టెలికం ఆపరేటర్లు ప్రభుత్వంపై తీసుకురావడంతో గత్యంతరం లేక ట్రాయ్ సూచన మేరకు రింగో తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై

3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై

రింగో మొబైల్ యాప్ 3జీ, 4జీ నెట్‌వర్క్‌లపై, వైఫై మోడ్‌లోనూ పనిచేస్తుంది. ఈ యాప్ కస్టమర్లను వారి మొబైల్ నంబర్ ఆధారంగా నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తుంది. దీంతో దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నంబర్‌కు అయినా కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Ringo slams telcos for not providing interconnect points for internet telephony services read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X