సామ్‌సంగ్ ఫోన్ వాడుతున్నారా..? ఈ సూపర్ యాప్ మీ కోసమే

Secure Folder appతో మీ ఫోన్ మరింత సురక్షితం...

|

ఒకే ఫోన్‌లో రెండు రకాల వర్కులను చేసుకునేందుకు వీలుగా సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన మై క్నాక్స్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ (My Knox security platform), గెలాక్సీ సిరీస్ నుంచి ఎలిమినేట్ కాబడిన విషయం తెలిసిందే. తాజాగా, Knox యాప్ స్థానంలోకి Secure Folder పేరుతో సరికొత్త సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌ను సామ‌సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి పొందండి..

గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి పొందండి..

Secure Folder యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లను వాడుతోన్న ప్రతిఒక్కరు ఈ యాప్‌ను తమ ఫోన్‌లలో ఉచితంగా ఇన్‌‌స్టాల్ చేసుకోవచ్చు.

Knox security platform ఎలా పనిచేసేదంటే..?

Knox security platform ఎలా పనిచేసేదంటే..?

ఈ శాండ్‌బాక్స్ ప్లాట్‌ఫామ్ ఆఫీసుకు సంబంధించిన యాప్స్‌ను సపరేట్‌గానూ, ఇంటికి సంబంధించిన పర్సనల్ యాప్స్‌ను సపరేట్‌గానూ ఉంచి ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ యాప్స్‌ను, ఆఫీసులో ఉన్నప్పుడు పర్సనల్ యాప్స్‌ను వేరొకరు ఓపెన్ చేయకుండా లాక్ చేసేసిది.

గెలాక్సీ నోట్ 7 ద్వారా సెక్యూరిటీ ఫోల్డర్ యాప్‌ పరిచయం..
 

గెలాక్సీ నోట్ 7 ద్వారా సెక్యూరిటీ ఫోల్డర్ యాప్‌ పరిచయం..

క్నాక్స్ సెక్యూరిటీ యాప్‌కు రీప్లేస్‌మెంట్‌గా భావిస్తోన్న సెక్యూరిటీ ఫోల్డర్ యాప్‌ను గెలాక్సీ నోట్ 7 ఫోన్ ద్వారా సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఆ తరువాత గెలాక్సీ యాప్ స్టోర్‌లో మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉండేది. అందరికి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశ్యంతో సామ్‌సంగ్ Secure Folder యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లోకి తీసుకువచ్చింది.

Secure Folder యాప్‌ ఎలా పనిచేస్తుంది..?

Secure Folder యాప్‌ ఎలా పనిచేస్తుంది..?

Knox యాప్ తరహాలోనే Secure Folder యాప్‌ కూడా ఇంచుమించుగా అలాంటి డేటా ప్రొటెక్షన్ సేవలను అందిస్తుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్స్‌తో పాటు ముఖ్యమైన డేటా ఫోల్డర్స్‌ను సెక్యూరిటీ ఫోల్డర్ యాప్ లోని 'Move to Secure Folder' అనే ఆప్షన్ ద్వారా సురక్షితమైన ప్రదేశంలోని మూవ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను పిన్, ప్యాట్రన్, పాస్‌వర్డ్, బయోమెట్రిక్ వంటి పద్థతుల ద్వారా లాక్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
Samsung’s Secure Folder app makes it way to Google Play Store. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X