సరాహ్ యాప్ తో డేంజరే!

By: Madhavi Lagishetty

సరాహ్ యాప్...తామెవ్వరో తెలియకుండా మెసేజీలను పంపొచ్చు..కొన్ని వారాల కిందట ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని ప్రాచుర్యం పొందింది. మిలియన్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. అయితే ఇదేదో మంచి యాప్ అనుకుని తెగా వాడేసారు.

సరాహ్ యాప్ తో డేంజరే!

అయితే సోషల్ మీడియాను యాక్టివ్ గా ఫాలో అవుతున్న ప్రతిఒక్కరూ ఈ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఈ యాప్ స్నేహితులను సరదా ఆట పట్టించేందుకు ఉపయోగపడింది. అంతేకాదు ఈ యాప్ ద్వారా అనైతిక కార్యకలాపాలు పాల్పడటానికి అవకాశం ఉంది. సరాహ్ యాప్ ద్వారా పంపించిన మెసేజ్ ల్లో ఎలాంటి గోప్యత ఉండదు. ఈ యాప్ మీ ఫోన్ కాంటాక్ట్ లను తస్కరించి, సంస్థ యొక్క సర్వర్ కు వాటిని బదిలీ చేస్తుంది.

ఐటీ సెక్యూరిటీ కంపెనీ బిషాప్ ఫాక్స్ లో అనలిస్ట్ గా పనిచేసే జాకీరీ జూలియన్ మరియు ది ఇంటర్సెప్ట్ మొదట దీనిని నివేదించింది. మీరు ఆండ్రాయిడ్ లేదా Ios వినియోగదారులు అయితే , మీ ఫోన్ లోని అన్ని కాంటాక్ట్ లను సరాహ్ యాప్ ద్వారా కంపెనీ సర్వర్లో అప్లోడ్ చేయబడతాయి.

జియో కౌన్ బనేగా క్రోర్ పతి, ఆడండి, గెలవండి

సాధారణంగా యాప్స్ ఫోన్ బుక్ యాక్సెస్ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ యాప్స్ కు ఫీచర్ కాంటాక్ట్స్ అవసరం. అయితే సరాహ్ యాప్ కు ఈ సమయంలో ఏ విధమైన ఫీచర్ లేదు. సో సంస్థ ఎందుకు సర్వర్ కాంటాక్ట్ లను స్టోర్ చేస్తుంది?

సరాహ్ యాప్ వ్యవస్థాపకుడు జైన్ అల్-అబిదిన్ తవ్ఫిక్ ప్రకారం...అతని యాప్ వాస్తవానికి కాంటాక్ట్ లను స్టోర్ చేస్తుంది. అందుకోసమే సారాహ్ కాంటాక్టు పర్మిషన్ కోరుతుందని తెలిపారు.

మీ ఫోన్ కాంటాక్ట్స్ యాక్సిస్ చేయనీయకుండా మరియు ఇప్పటికీ దాన్ని ఉపయోగించకుండా ఆపడానికి మీకు అవకాశం ఉంది. ఏమైనా మీరు చెక్ చేయగల సరాహ్ యాప్ యొక్క ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.

Read more about:
English summary
The Sarahah app allegedly steals your phone's contacts and transfers them to the company's server.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot