సోషల్ మీడియాని ఊపేస్తున్నయాప్, మీ వివరాలు తెలీకుండానే ఛాట్

Written By:

ఇప్పుడు సోషల్ మీడియాని ఓ యాప్ ఊపేస్తోంది. దానిపేరే సరాహ్. అత్యంత తక్కువ కాలంలో చాలా పాపులర్ అయిన యాప్ ఇది. ఈ యాప్ ద్వారా మీరు ఎవరో తెలియకుండానే మెసేజ్ లు పంపవచ్చు. అలాగే రిసీవ్ చేసుకోవచ్చు. మీ వివరాలు అవతలి వారికి అసలు తెలియవు.

మళ్లీ కొత్త వెర్షన్‌లో బుడ్డ ఫోన్, దుమ్మురేపడం ఖాయమే ఇక !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే

ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, మెసేజ్ లు పంపినా, వచ్చినా అవి పంపిన వారి వివరాలు తెలియకపోవడమే దీని ప్రత్యేకత. అజ్ఞాత రూపంలో మెసేజ్ లు పంపుతూ, పరిచయం లేని వారి నుంచి స్వీకరిస్తూ ఉండవచ్చు. అంతేకాదు, ఎటువంటి లాగిన్ అవసరం లేకుండానే వాడుకోవచ్చు.

ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో

బీబీసీ రిపోర్టు ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో శరవేగంగా, ఎన్నో దేశాల్లో వేగంగా ఈ యాప్ విస్తరిస్తోంది.

 

ప్రొఫైల్ ను సెట్ చేసుకుంటే

ఈ యాప్ లో రిజిస్టర్ అయి, ప్రొఫైల్ ను సెట్ చేసుకుంటే, అది అందరికీ కనిపిస్తుంది. మీకు ఏదైనా మెసేజ్ పెడితే, అది ఇన్ బాక్స్ లోకి వస్తుంది. దాన్ని చూసిన తరువాత ఎవరు పంపారో తెలిస్తే, వారి పేరును యూజర్ యాడ్ చేసుకోవచ్చు.

10 వేలకు పైగా ఫైవ్ స్టార్ రేటింగ్ రివ్యూలు

మెసేజ్ లను ఫ్లాగ్ చేయడం, డిలీట్ చేసుకోవడం, రిప్లయ్ ఇవ్వడం వంటివి చేసుకోవచ్చు. గూగుల్ ప్లేలో శరవేగంగా దూసుకెళుతున్న ఈ యాప్ కు 10 వేలకు పైగా ఫైవ్ స్టార్ రేటింగ్ రివ్యూలు వచ్చాయి.

తిట్లు, శాపనార్థాలు

అయితే, ఈ రివ్యూలు రాసిన వారిలో చాలా మంది తమకు తిట్లు, శాపనార్థాలు మెసేజ్ లుగా వస్తున్నాయని చెబుతున్నారు.

యాప్ దూసుకెళుతుండటంతో

ఇక ఈ యాప్ దూసుకెళుతుండటంతో, యూజర్ అనుభూతిని మరింతగా పెంచాలని డెవలపర్లు నిర్ణయించుకున్నారు. ప్రైవసీ ఆప్షన్లు ప్రవేశపెట్టి, సెర్చ్ రిజల్ట్స్ నుంచి ప్రొఫైల్ ను తొలగించడం, ఆడియన్స్ సంఖ్యపై నియంత్రణ, అనాథరైజ్డ్ యూజర్లను బ్లాక్ చేయడం వంటివి చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు యాప్ ను అభివృద్ధి చేసిన టీమ్ చెబుతోంది.

చాలా బాగుందని

తెలియని వారి ప్రొఫైల్ చూసి మెసేజ్ చేయడం, తెలియని వారి నుంచి మెసేజ్ లు అందుకోవడం చాలా బాగుందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.

ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్

ఈ యాప్ ఆండ్రాయిడ్ తో పాటు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోనూ అందుబాటులో ఉంది. సరాహ్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sarahah App: What Is It, and Why Is Everyone Talking About It Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting