నవంబర్ 12 లోపు వాట్సప్ డేటా బ్యాకప్ చేసుకోకపోతే ఇంక అంతే
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే.
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. అలాంటి యాప్ యూజర్లకు ఈ మధ్య షాకులిస్తూ పోతోంది.ఈ నేపథ్యంలో నవంబర్‌లో వాట్సప్‌లో అతిపెద్ద అప్‌డేట్ కోట్లాదిమంది యూజర్లను కాస్తా ఇబ్బంది కలిగించనుంది.ఇప్పటివరకు ఉన్న వాట్సప్ ఛాట్ బ్యాకప్ విధానం కాస్త మారబోతుంది . ఇంతకముందు వాట్సప్ బ్యాకప్ మొత్తం గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యేది. గూగుల్ మీకు కేటాయించిన స్పేస్‌లోనే వాట్సప్ డేటా వాటా కనిపించేది. ఇకపై వాట్సప్ డేటా బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు దీనికి కారణం గూగుల్‌తో వాట్సప్ చేసుకున్న ఒప్పందమే.

యూజర్లు బ్యాకప్ చేసుకున్న వాట్సప్ డేటా....
నవంబర్ 12 నుంచి యూజర్లు బ్యాకప్ చేసుకున్న వాట్సప్ డేటా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్‌లో కనిపించదు. మీ ఫోన్ నెంబర్స్, సెట్టింగ్స్, మెసేజెస్ గూగుల్ అకౌంట్‌లోకి వెళ్లినట్టు వాట్సప్ ఆటోమెటిక్ బ్యాకప్స్ కూడా గూగుల్ అకౌంట్‌లో స్టోర్ అవుతాయి.

వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు.....
మీరు ఫోన్ మార్చినప్పుడు లేదా వాట్సప్ డిలిట్ చేసి మళ్లీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు గూగుల్ నుంచి వాట్సప్ బ్యాకప్ ద్వారా మొత్తం మెసేజెస్ రీస్టోర్ అవుతాయి.

ఒక్కసారి నవంబర్‌లో అప్‌డేట్ రిలీజ్ అయిందంటే....
ఒక్కసారి నవంబర్‌లో అప్‌డేట్ రిలీజ్ అయిందంటే ఏడాది కంటే ఎక్కువగా అప్‌డేట్ చేయని వాట్సప్ బ్యాకప్స్(ఫోటోలు, వీడియోలు, ఛాట్స్) గూగుల్ స్టోరేజీ నుంచి డిలిట్ అయిపోతాయి.

వాట్సప్ యూజర్లు ఏడాదిగా డ్రైవ్‌లోకి బ్యాకప్ చేయలేదంటే....
వాట్సప్ యూజర్లు ఏడాదిగా డ్రైవ్‌లోకి బ్యాకప్ చేయలేదంటే ఆ డేటా కోల్పోవడం ఖాయం. అందులో ముఖ్యమైన ఛాట్స్‌తో పాటు మీడియా ఫైల్స్ కూడా ఉండొచ్చు. గూగుల్ డ్రైవ్‌లో చాలాకాలంగా డేటా ఉంటే 2018 నవంబర్ 12 లోగా "మ్యాన్యువల్లీ బ్యాకప్" చేసుకోవాలని వాట్సప్ సూచిస్తోంది.

కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది...
కమ్యూనికేషన్ అవసరాల నిమిత్తం వాట్సాప్‌ను ఎక్కువుగా వినియోగించుకోవటం వల్ల కీలక డేటా మొత్తం వాట్సాప్‌లోనే స్టోర్ అయి ఉంటోంది. పొరపాటున ఫోన్‌ను ఛేంజ్ చేయవల్సి వస్తే వాట్సాప్ డేటాను ఏ విధంగా రికవర్ చేసుకోవాలో తెలియక చాలా మంది యూజర్లు ఆందోళణ చెందుతున్నారు. వాట్సాప్ యూజర్ అకౌంట్‌లో సేవ్ అయి ఉండే ప్రతిఫైల్ కూడా బ్యాకప్ అయి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ అయి ఉన్న వాట్సాప్ చాట్ హిస్టరీనిను ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

‘Chat backup’లోకి వెళ్లి..
ముందుగా మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి యాప్ మెయిన్ స్ర్కీన్ పై కనిపించే త్రీ డాట్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టాప్ రైట్ కార్నర్‌లో ఈ ఐకాన్ మీకు కనిపిస్తుంది. ఐకాన్ పై క్లిక్ చేసిన తరువాత సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి ‘Chats' పై టాప్ ఇవ్వండి. ఇప్పుడు ‘Chat backup'లోకి వెళ్లి మీ చాట్ హిస్టరీ మొత్తం గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అయ్యేలా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోండి.

సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది...
ఈ బ్యాకప్ అనేది రోజుకోసారి అవ్వాలా, వారానికోసారి అవ్వాలా లేక నెలకోసారి అవ్వాలా అన్న దాని పై సెట్టింగ్స్‌ను మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాకప్ అనేది వై-ఫై కనెక్షన్‌తో ఉన్నపుడు జరగాలా లేక మొబైల్ డేటా ఆన్ అయి ఉన్నపుడు జరగాలా అనే దాని పై కూడా సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.

పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌లోకి ఛేంజ్ అవుతున్నట్లయితే...
ఒకవేళ మీరు పాత స్మార్ట్‌ఫోన్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లోకి ఛేంజ్ అవుతున్నట్లయితే, మీ పాత డివైస్‌లోని వాట్సాప్ చాట్ హిస్టరీని రీస్టోర్ చేసుకునేందుకు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ముందుగా మీ పాత్ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ వాట్సాప్ మెసెంజర్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసి మీ డివైస్‌లోని కాంటాక్ట్స్, ఫోటోస్ ఇంకా మీడియా ఫైల్స్‌ను యాక్సిస్ చేసుకునేందుకు అవసరమైన పర్మిషన్‌ను వాట్సాప్‌కు ఇవ్వవల్సి ఉంటుంది.

ఫోన్ నెంబర్‌ను యాప్‌లో వెరిఫై చేసుకున్నట్లయితే..
ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత మీ కొత్త డివైస్‌లో ఉన్న వాట్సాప్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి. అప్‌డేట్ పూర్తయిన తరువాత మీ ఫోన్ నెంబర్‌ను యాప్‌లో వెరిఫై చేసుకోండి. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో భాగంగా 6 అంకెలతో కూడిన వెరిఫికేషన్ కోడ్ ఒకటి మీ ఫోన్‌కు అందుతుంది. ఈ కోడ్ ఆటోమెటిక్‌గా వెరిఫై కాబడి అకౌంట్ వినియోగానికి సిద్ధమవుతుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే ‘Restore backup' పేరుతో మరో ఆప్షన్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ‘Restore' బటన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ వాట్సాప్ మెసేజెస్ అన్ని రీస్టోర్ కాబడతాయి.


Click it and Unblock the Notifications








