SBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోనో (యూ నీడ్‌ ఓన్లీ వన్‌) పేరిట కొత్త యాప్‌ను అందుబాటలోకి తీసుకువచ్చింది.

By Hazarath
|

డిజిటల్ సేవలను మరింత విస్తరించే దిశలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యోనో (యూ నీడ్‌ ఓన్లీ వన్‌) పేరిట కొత్త యాప్‌ను అందుబాటలోకి తీసుకువచ్చింది.కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చేతుల మీదగా ఈ యాప్ ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ యాప్ తో ఉపయోగాలేంటి అనే విషయంలో చాలామంది తర్జన భర్జన పడుతున్నారు.

జియో కొట్టిన దెబ్బపై Airtel అధినేత స్పందన ఇదే !జియో కొట్టిన దెబ్బపై Airtel అధినేత స్పందన ఇదే !

 ఈ యాప్ ద్వారా ..

ఈ యాప్ ద్వారా ..

కొత్తగా లాంచ్ అయిన ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు నిర్వహించడం, రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవడం లాంటి పనులు చేయవచ్చు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌..

ఆన్‌లైన్‌ షాపింగ్‌..

దీంతో పాటు ఆన్‌లైన్‌ షాపింగ్‌ కూడా చేసుకునే సౌకర్యం ఉంది. పుడ్, అలాగే ట్రావెలింగ్ అలాగే ఇతర షాపింగ్ లన్నీ ఈ యాప్ ద్వారా మీరు పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులతో పాటు యూజర్ల లైఫ్‌స్టయిల్‌కి అనుగుణంగా 14 కేటగిరీల్లో యోనో యాప్‌ ద్వారా షాపింగ్‌ కూడా చేసే అవకాశం ఉంది.

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఆర్థిక పథకాలన్నింటిని..

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఆర్థిక పథకాలన్నింటిని..

ఎస్‌బీఐతో పాటు దాని అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ జనరల్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, ఎస్‌బీఐ క్యాప్స్, ఎస్‌బీఐ కార్డ్స్‌ ఆర్థిక పథకాలన్నింటిని ఈ యాప్‌కి అనుసంధానం అయి ఉంటాయి.

వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా..

వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా..

మీరు ఆధార్‌ నంబరు, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ఇంటి నుంచి కదలకుండా ఆన్‌లైన్‌లోనే పూర్తి స్థాయి సేవింగ్స్‌ అకౌంటును తెరిచే అవకాశం కూడా ఉంది.

కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు..

కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు..

కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు అందించేందుకు 60 పైగా ఈ-కామర్స్‌ సంస్థలతో చేతులు కలిపినట్లు SBI తెలిపింది. అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, స్విగీ, బైజూస్‌ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి.

యాప్ డౌన్ లోడ్ కావాలనుకున్న వారు..

యాప్ డౌన్ లోడ్ కావాలనుకున్న వారు..

యాప్ డౌన్ లోడ్ కావాలనుకున్న వారు ఈ లింక్ మీద క్లిక్ చేసి పొందవచ్చు.

Best Mobiles in India

English summary
SBI to launch YONO lifestyle-cum-banking app, portal Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X