Home
Apps

YouTube Go..ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు

By Sivanjaneyulu Bommu

విప్లవాత్మక స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తూ టెక్నాలజీ రారాజుగా అవతరించిన గూగుల్ తాజాగా, ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో (YouTube Go) పేరుతో సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది.

YouTube Go..ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు

Read More : ఇండియాలో ప్రతి 7 సెకన్లకు ఒక Redmi Note 3 ఫోన్ అమ్ముడవుతోంది..

లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టువిటీలో సైతం యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్‌వర్క్‌లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని Smart Offline ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిలేకుండా వీక్షించవచ్చు.

యూట్యూబ్ గో యాప్ గురించి క్లుప్తంగా..

యూట్యూబ్ గో యాప్ గురించి క్లుప్తంగా..

భారత్‌లో యూట్యూబ్‌ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. నచ్చిన సినిమా ట్రైలర్స్ మొదలుకుని పాటలు, సినిమాలు అన్ని యూట్యూబ్‌లోనే వెతికేస్తుంటారు మన నెటిజనులు. ఈ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుకు ఇంతగా డిమాండ్ నెలకున్న నేపథ్యంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లేందుకు YouTube Go పేరుతో విప్లవాత్మక యాప్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

2జీ నెట్‌వర్క్‌లలో కూడా...

2జీ నెట్‌వర్క్‌లలో కూడా...

ఈ యాప్ ద్వారా యూజర్లు 2జీ నెట్‌వర్క్‌లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్ తో ఇప్పుడు లభ్యంకానుంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో వీడియోలను వీక్షించేటపుడు విడియోకు సంబంధించిన క్వాలిటీని కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

డేటాను పొదుపుగా వాడుకునే అవకాశం

డేటాను పొదుపుగా వాడుకునే అవకాశం

ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్‌కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్‌ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియోను ఫోన్ ఎస్డీకార్డ్‌లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మీ డేటా లిమిట్‌ను బట్టి ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.

వీడియో షేరింగ్ సదుపాయం కూడా...

వీడియో షేరింగ్ సదుపాయం కూడా...

యూట్యూబ్ గో యాప్ ద్వారా వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్‌లైన్ మోడ్‌లో వీక్షించటమే కాదు వాటిని లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా మీకు సమీపంలోని యూజర్లకు షేర్ చేసుకోవచ్చు.

త్వరలో అందుబాటలోకి...

త్వరలో అందుబాటలోకి...

యూట్యూబ్ గో యాప్ భారత్‌లో అధికారికంగా లాంచ్ కాలేదు. ఈ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని గూగుల్ తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
You Can Now Share and Download Videos Without Any Data in India with YouTube Go. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X