Home
Apps

పెద్ద వీడియోలను చిన్నగా కంప్రెస్ చేయటం ఎలా..? (సింపుల్ ట్రిక్స్)

VLC మీడియా ప్లేయర్‌ను మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేసేందుకే కాకుండా, వీడియో కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

By Sivanjaneyulu Bommu

సినిమాలు అలానే పాటలను తమ కంప్యూటర్లలో ప్లే చేసేకునేందుకుగాను, విండోస్ యూజర్లకు అందుబాటులో ఉన్న మొట్టమొదటి మీడియా ప్లేయర్ అప్లికేషన్ VLC మీడియా ప్లేయర్. ఈ యూజర్ ఫ్రెండ్లీ మీడియా ప్లేయర్ యాప్ డజన్ల కొద్ది కస్టమైజేషన్ ఫీచర్లతో యూజర్లను కట్టిపడేస్తోంది.

Read More : Root చేసిన ఆండ్రాయిడ్ ఫోన్‌ను ప్రమాదాల నుంచి కాపాడుకోవటం ఎలా..?

క్విక్ వీడియో కట్టింగ్ టూల్‌

క్విక్ వీడియో కట్టింగ్ టూల్‌

VLC మీడియా ప్లేయర్‌ను మల్టీమీడియా ఫైల్స్‌ను ప్లే చేసేందుకే కాకుండా, వీడియో కన్వర్టర్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లేయర్ యాప్‌ను ఉపయోగించుకుని మీ అవసరాలకు అనుగుణంగా వీడియోలను ఒక ఫార్మాట్ నుంచి మరొక ఫార్మాట్‌కు సులువుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. VLC మీడియా ప్లేయర్‌ను క్విక్ వీడియో కట్టింగ్ టూల్‌గా ఉపయోగించుకునేందుకు 5 సింపుల్ మార్గాలు..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీ విండోస్ పీసీలో VLC మీడియా ప్లేయర్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన తరువాత ప్లేయ‌ ను లాంచ్ చేసి మెనూలోని ‘Media' సెక్షన్‌‌లోకి వెళ్లండి.

స్టెప్ 2

స్టెప్ 2

మీడియా సెక్షన్‌లోని ‘Convert/Save' ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడో విండోస్ పాపప్, స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. మీడియా ఆప్షన్స్‌లోకి వెళ్లేందుకు ‘Ctrl+R' కమాండ్‌ను కూడా ఉపయోగించవచ్చు.

స్టెప్ 3

స్టెప్ 3


స్ర్కీప్ పై ప్రత్యక్షమైన పాపప్ బాక్సులో ‘Add' బటన్ పై క్లిక్ చేసి, మీరు కంప్రెస్ చేయాలనుకుంటున్న వీడియో ఫైల్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

స్టెప్ 4

ఫైల్ సెలక్ట్ అయిన పాపప్ బాక్సులో దిగువును కనిపించే ‘Convert/Save' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. వీడియో కంప్రెషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5

వీడియో కంప్రెషన్ ప్రక్రియ వీడియో ఫార్మాట్ అలానే సైజును బట్టి ఉంటుంది. ఫైల్ కంప్రెస్ అయిన తరువాత వీడియోలను ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Tips to compress large video files with VLC Player. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X