వాట్సప్‌లోకి త్వరలో రానున్న 6 కొత్త ఫీచర్లు ఇవే
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లను యూజర్లను కట్టిపడేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫీచర్లను యూజర్లను కట్టిపడేస్తోంది.ఫేస్‌బుక్ సొంతమైన ఈ యాప్ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఉండి తీరాల్సిందే. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్ ఇప్పుడు మరో ఆరు కొత్త ఫీచర్లతో దూసుకువస్తోంది. ఇవి అతి త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆ ఫీచర్లు ఏంటి వాటితో ఉపయోగాలు ఏంటి ఓ స్మార్ట్ లుక్కేయండి.

వాట్సప్ డార్క్ మోడ్
అవును మీరు విన్నది నిజమే.. WABetaInfo రిపోర్టు ప్రకారం వాట్సప్ ఈ ఫీచర్ మీద పనిచేస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్,ఐఓఎస్ ఫ్లాట్ ఫాం మీద రన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని ద్వారా బ్యాటరీ ఆదా, డిస్ ప్లే మార్పులు లాంటి వాటిని చూడవచ్చు.

వాయిస్ మెసేజ్ ప్లే బ్యాక్
ఈ ఫీచర్ ఇంతకుముందు ఐఓఎస్ ఫ్లాట్ ఫాం మీద వచ్చింది. ఇప్పుడు దీన్ని మరింతగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. దీని ద్వారా వాయిస్ మెసేజ్ పంపగానే ఆటోమోటిగ్గా బ్యాక్ గ్రౌండ్లో ప్లే అవుతుంది. వాయిస్ మెసేజ్ లు అన్నీ ప్లే అయ్యే సమయంలో షార్ట్ సౌండ్ అలర్డ్ వస్తుంది.

గ్రూప్ కాలింగ్ షార్ట్ కట్ ఫీచర్
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన వారిని గ్రూప్ కాల్ లో షార్ట్ కట్ చేసుకోవచ్చు. అందరికీ ఒకేసారి కాల్స్ వెళతాయి. అలాగే గ్రూప్ ఛాట్ బాక్సులో ఇది రైట్ సైడ్ ఉంటుంది.

మల్టి షేర్ ప్రివ్యూ
మల్టి షేర్ ప్రివ్యూ ద్వారా యూజర్లు ఇంతకుముందు పంపిన , ఫార్వార్డ్ చేసిన మెసేజ్ ల ప్రివ్యూను చూడవచ్చు. ఈ ఫీచర్ బీటా వర్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంది.

Vacation Mode
పనికిరాని మెసేజ్ లు మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ని తీసుకొస్తోంది. ఈ ఫీచర్ వాట్సప్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ లో చూడవచ్చు.

Private Reply in Group Chats
గ్రూప్ చాట్ లో మీరు కాంటాక్ట్ కి పర్సనల్ గా రిప్లయి ఇవ్వవచ్చు. గ్రూపు నుండి బయటకు రాకుండానే దీన్ని మీరు ఇవ్వవచ్చు. ఈ ఫీచర్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications