ఇక Snapchat+ లో మీ స్టోరీ ఎవ‌రైనా రెండోసారి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది!

|

స్నాప్‌చాట్‌లో ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకు రానున్న‌ట్లు ఎన్నో రోజుల నుంచి వ‌స్తున్న పుకార్ల‌కు చివ‌ర‌కు తెర ప‌డింది. స్నాప్‌ ఎట్టకేలకు Snapchat Plus ని విడుదల చేసింది. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ చెల్లింపు ద్వారా ప్రత్యేకమైన ఫీచర్లు మరియు మరిన్ని ప్రయోజనాలను యూజ‌ర్ల‌కు అంద‌నున్నాయి. Snapchat Plus కు నెలకు $3.99 (సుమారు రూ. 300) ధరను నిర్ణ‌యించింది. త‌మ‌ ప్లాట్‌ఫారమ్‌లో ఎక్కువ సమయం తమ స్నేహితులతో ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ Snapchat ప్లస్ ప్రత్యేకంగా పరిచయం చేయబడింది. ఈ స‌ర్వీస్‌ ను "కొత్త ఆదాయ వనరు" గా కంపెనీ SVP, Jacob Andreou, అభివర్ణించారు.

 
ఇక Snapchat+ లో మీ స్టోరీ ఎవ‌రైనా రెండోసారి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది

ప్ర‌స్తుతం ఈ Snapchat Plus సేవలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. Snap అధికారిక ప్రకటన ప్రకారం, "ఈరోజు మేము Snapchat+ని ప్రారంభించాము, నెలకు $3.99 కి అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన, ప్రయోగాత్మక ఫీచర్ల సమాహారం ఈ స్నాప్‌చాట్ ప్ల‌స్‌. ఈ సబ్‌స్క్రిప్షన్ మా కమ్యూనిటీలోని కొంతమంది అత్యంత ఉత్సాహ‌వంతులైన సభ్యులకు కొత్త స్నాప్‌చాట్ ఫీచర్‌లను అందించడానికి అనుమతిస్తుంది" అని కంపెనీ పేర్కొది. ఈ కొత్త ఫీచ‌ర్‌తో సబ్‌స్క్రైబర్‌లు స్టైలిష్‌ స్నాప్‌చాట్ ఐకాన్ పొందుతారు. అంతేకాకుండా ఈ స్నాప్‌చాట్ ప్ల‌స్ యూజ‌ర్ల‌కు త‌మ స్టోరీల‌ను ఎవ‌రైనా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తే తెలుసుకునే సౌక‌ర్యాన్ని పొందుతారు.

ఇక Snapchat+ లో మీ స్టోరీ ఎవ‌రైనా రెండోసారి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది

ది వెర్జ్ ఇచ్చిన‌ నివేదిక ప్రకారం, స్నాప్‌చాట్ ప్లస్ "కాస్మెటిక్ అప్‌గ్రేడ్"ని అందిస్తుంది. ఫీచర్‌ల పరంగా, సబ్‌స్క్రైబర్‌లు స్టైలిష్‌ స్నాప్‌చాట్ ఐకాన్ పొందుతారు. అంతేకాకుండా ఈ స్నాప్‌చాట్ ప్ల‌స్ యూజ‌ర్ల‌కు త‌మ స్టోరీల‌ను ఎవ‌రైనా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తే తెలుసుకునే సౌక‌ర్యాన్ని పొందుతారు. అదనంగా, వారు బెస్ట్ ఫ్రెండ్స్ ని పిన్ చేయడానికి ఉపయోగించే BFF పిన్‌ను పొందుతారు. BFF పిన్ ఫీచర్ ప్లస్ మెంబర్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది. ఒక‌సారి వినియోగ‌దారుడు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకున్న త‌ర్వాత ఆటో రెన్యూవ‌ల్ స‌దుపాయాన్ని క‌ల్పించారు. అత‌ను క్యాన్స‌ల్ చేసుకునే వ‌ర‌కు ఆ ఆటో రెన్యూవ‌ల్ ఆప్ష‌న్ కొన‌సాగుతుంది.

మ‌రోవైపు Snapchat ప్రధాన పోటీదారు Instagram కూడా దాని కంటెంట్ క్రియేట‌ర్ల కోసం ప్లాట్‌ఫారమ్‌లో చెల్లింపు సభ్యత్వ సేవను కూడా పరిచయం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లతో, క్రియేట‌ర్లు తమ ఫాలోవ‌ర్స్‌తో లోతైన కనెక్షన్‌లను అభివృద్ధి చేసుకోగలుగుతారని తెలుస్తోంది.

ఇక Snapchat+ లో మీ స్టోరీ ఎవ‌రైనా రెండోసారి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది

స్నాప్‌చాట్‌లో ఇప్ప‌టికే లొకేష‌న్ షేర్ స‌దుపాయం:
ఇటీవ‌ల కూడా స్నాప్‌చాట్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం చాలా కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. ఈ కాలంలో మ‌న స‌న్నిహితుల‌ భద్రతకు(Security) ఎంతో అవసరమైన లొకేషన్‌(Location) షేర్‌(Share) చేసుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చేసింది. క‌నీసం 15 నిమిషాల నుంచి కొన్ని గంట‌ల వ‌ర‌కు మీరు మీ లొకేష‌న్‌ను మీ తోటి వారితో పంచుకోవ‌చ్చు. ఈ ఆప్ష‌న్ ద్వారా మీ కుటుంబ‌స‌భ్యులు గానీ, మిత్రులు గానీ బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు వారు ఏదైనా ప్ర‌మాదంలో ప‌డితే.. ఆ లొకేష‌న్ షేరింగ్ ద్వారా వారు ఎక్క‌డ ఉన్నార‌నే విష‌యాన్ని మ‌నం సులువుగా తెలుసుకోవ‌డానికి మార్గం ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్‌ మ్యూజిక్ ను షేర్‌ చేసుకొనే ఫీచర్‌ను కూడా వినియోగదారులకు అందిస్తోంది. అక్టోబరు నెలలో ఐఓఎస్‌ డివైజెస్‌లో (iOS Devises) యూట్యూబ్‌ మ్యూజిక్‌ను స్నాప్‌చాట్‌లో షేర్‌ చేసుకొనే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ ఫోన్లపై(Android Phones)కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు 9టూ5గూగుల్‌ అనే సంస్థ ఓ నివేదికలో పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Snapchat Plus with ability to see who rewatched your Story

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X