Snapchat+ సేవ‌ల ధ‌ర‌ భార‌త్‌లోనే అత్యంత త‌క్కువ‌.. ఎందుకో తెలుసా!

|

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా అప్లికేష‌న్ Snapchat ఇటీవ‌లె త‌మ ప్లాట్‌ఫాంపై స్నాప్‌చాట్ ప్ల‌స్ (Snapchat+) పేరుతో స‌బ్‌స్క్రిప్ష‌న్ సేవ‌ల్ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. త‌ద్వారా తమ సంస్థకు మానిటైజ్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌డంతో పాటుగా.. స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందిన యూజ‌ర్ల‌కు ప‌లు ప్ర‌త్యేక ఫీచ‌ర్ల‌ను కూడా అందించ‌నుంది.

Snapchat+

ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ పొందిన వారికి స్నాప్‌చాట్ వెబ్ ఫీచ‌ర్ ను కూడా అందించ‌నుంది. ప్ర‌స్తుతానికి భార‌త మార్కెట్లో స్నాప్‌చాట్ ప్ల‌స్ సభ్యత్వాన్ని నామమాత్రపు నెలవారీ రుసుముతో కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను మ‌నం కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

భార‌త్‌లో SNAPCHAT+ స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర ఎంత‌!
ప్రపంచవ్యాప్తంగా, Snapchat+ ధర $3.99 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఇది భారత కరెన్సీ ప్ర‌కారం చూస్తే దాదాపు రూ.320 ఉంటుంది. కానీ, ఆ కంపెనీ భార‌త్‌లో మాత్రం స్నాప్‌చాట్+ (Snapchat+) సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ధర చాలా త‌క్కువ ధ‌ర ఒక నెలకు రూ.49 గా నిర్ణయించింది. దీన్ని బ‌ట్టి చూస్తే.. ఆ కంపెనీ భార‌త‌ దేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నం చేసిందని స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌చ్చు.

Snapchat+

SNAPCHAT+ స‌బ్‌స్క్రిప్ష‌న్ యూజ‌ర్ల‌కు వ‌చ్చే అద‌న‌పు ఫీచ‌ర్లు!
భారతదేశంలో ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వినియోగదారులు ప్రత్యేకమైన, ప్రయోగాత్మక అదనపు ఫీచర్‌లను పొందుతారని Snap ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. "ఈ సబ్‌స్క్రిప్షన్ మా కమ్యూనిటీలోని కొంతమంది అత్యంత ఉద్వేగభరితమైన సభ్యులకు కొత్త స్నాప్‌చాట్ ఫీచర్‌లను అందించడానికి అనుమతిస్తుంది మరియు ప్రాధాన్య మద్దతును అందించడానికి మమ్మల్ని అనుమతిస్తుంది" అని కంపెనీ గ‌తంలో తెలిపింది.

భారతదేశంలోని Snapchat+ వినియోగదారులు వెబ్‌లో ప్లాట్‌ఫారమ్‌ను ఉప‌యోగించుకునే వెసులుబాటు క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొంది. అంతేకాకుండా, వీడియో కాల్‌ల ద్వారా వారి స్నేహితులతో చాట్ చేయవచ్చు అని కూడా వెల్ల‌డించింది. ప్ల‌స్ వినియోగదారులు యాప్ చిహ్నాలను మార్చుకోగ‌ల‌ర‌ని, స్నాప్‌చాట్‌లో మీ కథనాలను ఎవరు చూశారో కూడా తెలుసుకోవ‌చ్చ‌ని కంప‌నీ పేర్కొంది. అంతేకాకుండా, మీ స్నేహితుల్లో ఒకరిని చాట్ స్క్రీన్ పైభాగానికి పిన్ చేయవచ్చని Snapchat చెబుతోంది. దీనితో పాటు, వారు వారి స్నేహితుల లొకేష‌న్‌ను చూడవచ్చు మరియు వారి పేరు పక్కన బ్లాక్ స్టార్ బ్యాడ్జ్‌ను కూడా జోడించవచ్చు.

Snapchat+

ప‌లు నివేదిక‌లు తెలిపిన ప్ర‌కారం.. స్నాప్‌చాట్ ప్లస్ "కాస్మెటిక్ అప్‌గ్రేడ్"ని అందిస్తుంది. ఫీచర్‌ల పరంగా, సబ్‌స్క్రైబర్‌లు స్టైలిష్‌ స్నాప్‌చాట్ ఐకాన్ పొందుతారు. అంతేకాకుండా ఈ స్నాప్‌చాట్ ప్ల‌స్ యూజ‌ర్ల‌కు త‌మ స్టోరీల‌ను ఎవ‌రైనా మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తే తెలుసుకునే సౌక‌ర్యాన్ని పొందుతారు. అదనంగా, వారు "BFF" పేరుతో ఎగువన ఉన్న వారి స్నేహితుల చాట్ చరిత్రలో ఒకరిని పిన్ చేయడానికి ఉపయోగించే BFF పిన్‌ను పొందుతారు. BFF పిన్ ఫీచర్ ప్లస్ మెంబర్‌లకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది.

Snapchat వినియోగదారులకు యాప్ యొక్క స‌బ్‌స్క్రిప్ష‌న్‌ వెర్షన్ అందుబాటులోకి తీసుకురావ‌డం ద్వారా మానిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తోంది. ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ కూడా తమ కంపెనీల‌కు సంబంధించి స‌బ్‌స్క్రిప్ష‌న్ సంస్క‌ర‌ణ‌ల గురించి ఇప్ప‌టికే ధృవీకరించాయి. టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల కోసం అదనపు ఫీచర్లను అందించే సేవ‌ల గురించి వివరాలను అధికారికంగా పంచుకున్నారు. అదేవిధంగా, Twitter దాని బ్లూ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను తీసుకు రానుంది, ఇది రాబోయే నెలల్లో మరిన్ని దేశాలకు ఆవిష్క‌రించ‌బ‌డుతుంద‌ని స‌మాచారం.

Snapchat+

స్నాప్‌చాట్‌లో సేవ్ మెమోరీస్ బ్యాక‌ప్ ఫీచ‌ర్‌ను ఎనేబుల్ చేసుకోవ‌డం ఎలాగో కూడా తెలుసుకుందాం:
వినియోగ‌దారులు త‌మ జ్ఞాప‌కాల‌ను కోల్పోకుండా, వాటిని ప‌దిలంగా బ్యాక‌ప్ చేసుకోవ‌డానికి గ‌త ఏప్రిల్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. మెమోరీస్ బ్యాక‌ప్ పేరుతో ఈ ఆప్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. ఈ మెమోరీ బ్యాక‌ప్ స‌దుపాయాన్ని మీరు పొందాల‌నుకుంటే ఈ కింది ఇచ్చిన విధానాన్ని అనుస‌రించండి.
* ముందుగా మై ప్రొఫైల్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* సెట్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ అయిన త‌ర్వాత కింద‌కు స్క్రోల్ చేసి మెమోరీస్ ట్యాబ్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత చెక్ ది బ్యాక్అప్ ప్రొగ్రెస్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం కంప్లీట్ అనే నోటిఫికేష‌న్ చూపిస్తే మీ మెమోరీ బ్యాక‌ప్ స‌క్సెస్ అయిన‌ట్లు నిర్దార‌ణ చేసుకోవాలి.
ఒక‌వేళ మీకు మెమోరీ బ్యాక‌ప్ కంప్లీట్ కాలేదు అని వ‌స్తే.. మీ డివైజ్ వైఫై స‌క్ర‌మంగా ఉందో లేదో చూసుకోవాలి.

Best Mobiles in India

English summary
Snapchat+ Premium Subscription Service Comes To India: Price And Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X