ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో చర్చ.. నెటిజన్లలో ఆందోళన..?
సోషల్ మీడియాలో అనేక అంశాలపై చర్చలు జరుగుతుంటాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) కొత్త ఫీచర్ లాంచ్ చేసిందని, ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టా ప్రొఫైల్ ను ఎవరు చూశారో తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుందనేది ఆ సోషల్ మీడియా చర్చల సారాంశం. అయితే ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ వార్తలు కేవలం పుకార్లు గానే తెలుస్తున్నాయి.
ఈ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ వ్యూ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరహా ఫీచర్ ను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకురాలేదు.

బిజినెస్ ప్రొఫైల్ సహా ఇతర వెరిఫైడ్ ప్రొఫైల్స్ మాత్రమే ఈ తరహా ఫీచర్ ఉంది. అయితే ఈ యూజర్లకు కూడా ఎంత మంది తమ ప్రొఫైల్‌ను చూశారనే సంఖ్య మాత్రమే కనిపిస్తుంది. కచ్చితంగా ఎవరు చూసేరనే వివరాలు తెలిసే అవకాశం లేదు. కేవలం తమ ప్రొఫైల్ ఎంగేజ్‌మెంట్ గురించి తెలుసుకొనేందుకు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుందో కొన్నిసార్లు అంతే ఆందోళనకు గురిచేస్తుందనేది ఈ ఘటన ఆధారంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ప్రొఫైల్ వ్యూ ఫీచర్ అందుబాటులో ఉందనే పుకారు కొందరికి ఆందోళన కలిగించినట్లు తెలుస్తోంది. అందువల్ల తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇన్‌స్టాగ్రామ్ గత వారం రెండు ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఇన్‌స్టా ఫీచర్ ద్వారా యూజర్లు తన యాప్‌లో రీల్స్ మరియు ఫీడ్ ఫోస్ట్‌లపై నోట్స్‌ను ఫోస్ట్ చేయవచ్చు. మూడు రోజుల పాటు ఈ నోట్ ఉంటుంది. మ్యూచువల్ ఫాలోవర్స్ మాత్రమే రీల్స్ మరియు పోస్ట్‌లను నోట్స్‌లో పోస్ట్ చేయగలరు.
దీంతోపాటు మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఒక రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆడియోను స్టిక్కర్, క్లిప్స్ మరియు టెక్స్ట్‌కు అనుగుణంగా ఎంచుకోవచ్చు. వీడియో ఎడిటర్ ఆప్షన్‌లో యూడ్ టూ మిక్స్‌లో ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవాలి. అనంతరం ఆడియోలో మీకు కావాల్సిన భాగాన్ని ఎంపిక చేసుకోవాలి. చివరికి ఈ మల్టీ ట్రాక్ అందుబాటులోకి వస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








