ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ “Watch Videos Together”
Soon watch videos together with your friends on Facebook.To Know More About Visit telugu.gizbot.com
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచర్‌ను తన ప్లాట్‌ఫామ్‌లో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఒకే వీడియోను అందరూ కలిసి ఒకేసారి వీక్షించే వీలుంటుందట. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం.

“Watch Videos Together” పేరుతో..
టెక్‌క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ మెసెంజర్ అప్లికేషన్‌లో ఇప్పటికే ఈ "Watch Videos Together"ను విజయవంతంగా టెస్ట్ చేస్తున్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించి ఇంటర్నల్ టెస్టింగ్ పూర్తయ్యందని ఫేస్‌బుక్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఫీచర్‌ను అఫీషియల్‌గా ఎప్పడు రోల్ అవుట్ చేస్తారనే దాని పై ఇప్పటి వరకైతే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అందుబాటులో లేదు.

నోటిఫికేషన్‌ను యాక్సప్ట్ చేసినట్లయితే..
ఈ ఫీచర్‌ను తొలత Ananay Arora అనే యూజర్ గుర్తించి ఆ వివరాలను తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ కోడ్ ప్రకారం ఏదైనా వీడియోను కలిసే చూసేందుకు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేసినట్లయితే ముందుగా మీకో నోటిఫికేషన్ అందుతుంది. ఈ నోటిఫికేషన్‌ను యాక్సప్ట్ చేసినట్లయితే ఆ వీడియోను అందరూ కలిసి వీక్షించే వీలుంటుంది.

మ్యూజిక్ ఫీచర్‌తో నచ్చిన పాటలను యాడ్ చేసుకునే అవకాశం..
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తమ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా మ్యూజిక్ పేరుతో మరో ఫీచర్‌ను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మ్యూజిక్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ స్టోరీల్లోని ఫోటోలు, వీడియోలకు తమకు నచ్చిన పాటలను జోడించే వీలుంది. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌కి సైతం వర్తిస్తుందని ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే యూజర్స్ తమ ప్రొఫైల్స్‌కి కూడా పాటలు జోడించే ఫీచర్ అందుబాటులోకి రానుందని ఫేస్‌బుక్ ఈ ప్రకటనలో పేర్కొంది.

Tik Tokకు పోటీగా Lasso యాప్..
Tik Tok యాప్ కు పోటీగా సోషల్ ఫేస్‌బుక్ ఓ సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకురాబోంది. Lasso (లస్సో) పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఓ స్పెషల్ టీమ్ ఈ యాప్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ తరహాలోనే లింప్ సింక్ లైవ్ ఫీచర్‌లను ఈ యాప్ ఆఫర్ చేయగలుగుతుందట. టెక్‌క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ డిజైన్ చేస్తోన్న లస్సో యాప్ ద్వారా యూజర్లు పాటలు అలానే డైలాగులకు అనుగుణంగా లిప్ సింక్ చేస్తూ వాటిని షేర్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ప్రిన్సిపల్ లీడ్ ప్రొడక్ట్ మేనేజర్ అయిన బ్రాడీ వోస్, లస్సో యాప్‌ను అభివృద్థి చేస్తోన్న టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నారట.


Click it and Unblock the Notifications