ఇంటర్నెట్ లేకుండా ఫ్రీ కాల్స్ చేసుకోవాలా...? అయితే మీ కోసమే ఈ యాప్ !

By Hazarath
|

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడటం సహజమే..వారు ఎవరికైనా వాయిస్ కాల్స్ చేసుకోవాలంటే ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి తెగ మాట్లాడేస్తుంటారు.అయితే ఒక్కోసారి ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో అర్జెంటుగా వాయిస్ కాల్స్ చేయాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ఇంటర్నెట్‌తో ప్రమేయం లేకుండా వాయిస్ కాల్స్ కోసం ఏమైనా యాప్స్ ఉన్నాయా అని తెగ వెతికేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం స్పీక్ ఫ్రీ యాప్ రెడిగా ఉంది. ఓ సారి ట్రై చేసి చూడండి. ఎలా ఉపయోగించాలో ఓ లుక్కేయండి.

 

ప్రపంచానికి ఊహించని షాకిచ్చిన LG, మడతపెట్టే టీవితో సంచలనంప్రపంచానికి ఊహించని షాకిచ్చిన LG, మడతపెట్టే టీవితో సంచలనం

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా మీరు గూగుల్ నుంచి Speakfree Apk ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు గూగుల్ ప్లే స్టోర్ లో లభించదు. దీన్ని సుంభవ్ కమ్యూనికేషన్ తయారుచేసినట్లు తెలుస్తోంది. ఇది కేరళ వారికోసం తయారు చేశారని సమాచారం. అయితే ఇండియాలో ఎక్కడైనా ఇది పనిచేస్తుందని వారు చెబుతున్నారు. లింక్ కోసం క్లిక్ చేయండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఈ ఫైల్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్ స్టాల్ చేయాలి. ఆ సమయంలో మీ పేరు, facebook id, అలాగే ఏదైనా District సెలక్ట్ చేసుకోవాలి.

 స్టెప్ 3
 

స్టెప్ 3

అది ఎంటర్ చేసిన తర్వాత టర్మ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి nextలోకి వెళ్లాలి. అక్కడ మీకు ఎసెమ్మెస్ లు కూడా పంపాలా అని ఓ pop up మెసేజ్ వస్తుంది. దాన్ని మీరు క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ నెట్ వర్క్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 4

స్టెప్ 4

అది కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాలనుకున్న నంబర్ కి కాల్ చేసి మూడు నిమిషాల పాటు మాట్లాడవచ్చు. హెవీ లోడ్ వల్ల కాల్ ఒక్కోసారి కనెక్ట్ కాకపోవచ్చు. రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే కాల్ కనెక్ట్ అవుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5

ఇంకో ఆప్సన్ ఏమిటంటే మీరు మీ మొబైల్ నుండి 18001231312 నంబర్ కి కాల్ చేసిన తర్వాత మీరు అక్కడ కనిపించే సూచనలతో మీ స్నేహితుని నంబర్ ఎంటర్ చేసి కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే ఇది రిజిస్టర్ నంబర్లకు మాత్రమే వర్తిస్తుంది.

స్టెప్  6

స్టెప్ 6

ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి కాల్ కట్ అవుతుంది. ఆ తర్వాత మీరు మళ్లీ ముందు చేసినట్లుగానే చేయాలి. ఇలా మీరు రోజుకు 30 నిమిషాల వరకు మాట్లాడుకోవచ్చు. ఈ యాప్ ఉదయం 9 నుంచి రాత్రి 9 మధ్యలో మాత్రమే పనిచేస్తుంది.

ముందుగా ఓ 20 సెకన్ల యాడ్

ముందుగా ఓ 20 సెకన్ల యాడ్

అయితే ఈ యాప్ లో మీకు ముందుగా ఓ 20 సెకన్ల యాడ్ వినిపిస్తుంది. అది పూర్తి అయిన తరువాతనే మీకు కాల్ కనెక్ట్ అవుతుంది. వారికి రెవిన్యూ ఈ యాడ్ రూపంలో వస్తుంది కాబట్టి అది మీరు స్కిప్ కొట్టేదానికి అవకాశం ఉండదు.

Best Mobiles in India

English summary
Speakfree Apk Free Calling Android App Without Internet Connection More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X