Home
Apps

యూట్యూబ్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ప్రీమియం లైట్ ప్లాన్ వచ్చేసింది.. ధర ఎంత తక్కువో..!

YouTube Premium Lite: వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. యూజర్ల కోసం 'యూట్యూబ్ ప్రీమియం లైట్' అనే కొత్త ప్లాన్ తెచ్చింది. ఇది యూట్యూబ్ ప్రీమియం కంటే చాలా తక్కువ ధరకే వస్తుంది. యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలనుకుంటున్నవాళ్లకు, ఫుల్ ప్రీమియం ఫీచర్లు అక్కర్లేని వాళ్లకి ఇది బాగుంటుంది. నెలకి కేవలం 7.99 డాలర్లు మాత్రమే. చాలా యూట్యూబ్ వీడియోలు యాడ్స్ లేకుండా హ్యాపీగా చూసేయొచ్చు. ఒక్క మ్యూజిక్ వీడియోలు తప్ప.

* ఫీచర్లు

యూట్యూబ్ ఈ ప్లాన్ పనితీరును బాగా పరిశీలించింది. చాలామంది యూజర్లను టెస్ట్ చేసి, వాళ్లకి ఏది కావాలో తెలుసుకొని మరీ ఈ ప్లాన్ సిద్ధం చేసింది. గేమింగ్, కామెడీ, వంటలు, చదువుకునే వీడియోలు చూసేవాళ్లకి ఈ ప్లాన్ బాగుంటుందని యూట్యూబ్ అంటోంది. కానీ ఈ ప్లాన్‌లో కొన్ని పరిమితులు ఉన్నాయని. ఆ పరిమితులు ఏవో చూద్దాం.

STOP Paying Full Price  YouTube Premium Lite is HERE See the Cheapest Price

* పరిమితులు

మ్యూజిక్ యాడ్స్ లేకుండా వినాలి అని ఉన్నా, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలి అని ఉన్నా, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవ్వాలి అని ఉన్నా మాత్రం, అప్పుడు మీరు యూట్యూబ్ ప్రీమియంకే వెళ్లాలి. ప్లాన్ ఆ సదుపాయాలను అందించలేదు. యూట్యూబ్ ప్రీమియం లైట్ తక్కువ ధరలో వస్తున్నా, వీడియోలు చూసే ఎక్స్‌పీరియన్స్ మాత్రం అదిరిపోతుంది.

యాడ్స్ తక్కువగా ఉండటం వల్ల, ముఖ్యంగా యంగ్ జనరేషన్ కి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్లకి డిస్ట్రాక్షన్స్ లేకుండా యూట్యూబ్ చూడాలని ఉంటుంది, కానీ ఎక్కువ ఫీచర్లు అక్కర్లేదు. యాడ్స్ ప్లే అవ్వవు కాబట్టి సమయం చాలా ఆదా అవుతుంది. వారు పనికొచ్చే పనులపై దృష్టి పెట్టడం కుదురుతుంది.

* ఎక్కడ అందుబాటులోకి వచ్చిందంటే..

ముందుగా ఈ ప్లాన్‌ను థాయ్‌లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియాలో టెస్టింగ్ చేశారు. ఇప్పుడు అమెరికాలో కూడా రిలీజ్ చేసేశారు. త్వరలోనే మిగతా దేశాల్లో కూడా తీసుకొస్తారంట. సబ్‌స్క్రిప్షన్ ద్వారా వచ్చే డబ్బులు పెంచుకోవడానికి, అలాగే వీడియోలు చేసే క్రియేటర్స్‌కు కూడా హెల్ప్ చేయడానికి యూట్యూబ్ ఇలా చేస్తోంది.

* యూట్యూబ్ విశేషాలు

యూట్యూబ్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది యూజర్లు యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. అందులో ట్రయల్ యూజర్లు కూడా ఉన్నారు. ఇలాంటి యూజర్స్‌కి నచ్చిన కంటెంట్ చూడటానికి చాలా ఆప్షన్స్ ఇవ్వాలని యూట్యూబ్ అనుకుంటోంది.

ఇప్పుడు చాలామంది మొబైల్స్‌లో, కంప్యూటర్లలో కాకుండా టీవీల్లోనే యూట్యూబ్ చూస్తున్నారంట. అందుకే తక్కువ ధరలో ఈ ప్లాన్ వస్తే, పెద్ద స్క్రీన్‌పై యాడ్స్ లేకుండా చూడాలని అనుకునేవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రకటనలు ఎక్కువగా వస్తే డేటా కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. దీనివల్ల అన్ని విధాలా నష్టమే అందుకే యూట్యూబ్ ప్రకటనలు లేని వీడియోలు చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

ప్రీమియం లైట్‌ని తీసుకురావడం కూడా ఇందులో భాగమే. దీనివల్ల, క్రియేటర్స్‌కి, పార్ట్‌నర్స్‌కి కొత్తగా డబ్బు సంపాదించే దారులు తెరుచుకుంటాయి, యూజర్స్‌కి కూడా వీడియోలు చూడటానికి ఎక్కువ ఎంపికలు ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
YouTube Premium Lite is a new 7.99 dollar ad-free plan. Enjoy ad-free viewing for most videos, but with fewer features than the full YouTube Premium plan, which costs 13.99 dollars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X