Home
Apps

ఆవేశంతో మెసేజ్‌లు వద్దు.. ప్లాన్‌తో మెసేజ్‌లు ముద్దు.. ఈ ఇన్‌స్టాగ్రామ్ స్మార్ట్ ట్రిక్ మీకోసం..!

Instagram scheduling: ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్‌డేట్స్‌తో ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే చేస్తూనే ఉంటుంది. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని ఫీచర్లు మనం డబ్బు సంపాదించడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే ఇటీవల ఈ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఒక ప్రయోజనకరమైన ఫీచర్ తెచ్చింది. అదే షెడ్యూల్ మెసేజ్. ఇప్పుడు మీరు మీ DM మెసేజ్‌లను కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండిట్లోనూ ఉంది.

ముఖ్యమైన రోజులు మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మెసేజ్‌లు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే తొందరపడి, ఆలోచించకుండా చెడు మెసేజ్‌లు పెడితే చాలా నష్టాలున్నాయి. అవతలి వారిని నొప్పించినట్లు కూడా ఉంటుంది. అదే ఆలోచించి, షెడ్యూల్ చేసి మెసేజ్ చేస్తే ఎవరికి ఏ సమస్యా రాదు.

Stop Sending DMs on Impulse

ఒకవేళ మంచి మెసేజ్ పెట్టలేదు అనుకుంటే దాన్ని వారికి చేరకముందే డిలీట్ చేసుకోవచ్చు. మీ ఆన్‌లైన్ ప్రెజెన్స్ అంటే ఇంటర్నెట్ ఉనికి, రిలేషన్‌షిప్స్‌ చాలా బలంగా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం. మరి మెసేజ్ షెడ్యూల్ చేయడం ఎలానో చాలా సింపుల్‌గా తెలుసుకుందాం పదండి.

* మెసేజ్‌లు షెడ్యూల్ చేయండిలా

ముందుగా పర్సనల్ మెసేజ్ లేదా డైరెక్ట్ మెసేజ్ విండో ఓపెన్ చేయాలి, మెసేజ్ టైప్ చేయాలి. సెండ్ బటన్‌ని కాస్తంత సేపు నొక్కాలి. షెడ్యూల్ మెసేజ్ అనే ఒక ప్యానెల్ వస్తుంది. ఎప్పుడు పంపాలో డేట్, టైమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెండ్ బటన్ నొక్కండి. మీరు సెట్ చేసిన టైమ్‌కి మెసేజ్ సెండ్ అయిపోతుంది.

* షెడ్యూల్ చేసిన మెసేజ్‌లను మేనేజ్ చేయడం ఎలా?

ఒకవేళ షెడ్యూల్ చేసిన మెసేజ్ మార్చాలన్నా, క్యాన్సిల్ చేయాలన్నా ఎలా అని ఆలోచిస్తున్నారా దానికి కూడా మంచి మార్గాలు ఉన్నాయి. ఈ పనులు చేయడానికి మీరు ఏ చాట్‌లో అయితే షెడ్యూల్ చేశారో అక్కడికి వెళ్లాలి. టెక్స్ట్ బాక్స్ పైన షెడ్యూల్డ్ మెసేజ్ బ్యానర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

తరువాత మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్ కనిపిస్తుంది. అక్కడ "సెండ్ నౌ", "కాపీ", "డిలీట్" అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. మెసేజ్ గానీ, సమయం గానీ మార్చాలంటే డిలీట్ చేసి మళ్లీ కొత్తగా షెడ్యూల్ చేసుకోవాల్సిందే. డైరెక్ట్‌గా ఎడిట్ చేసే ఆప్షన్ లేదు. అయినా కూడా అది అవతల వ్యక్తికి చేరకుండా మనం ఆపగలం.

* ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇంకో అదిరిపోయే ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు "కమ్యూనిటీ చాట్" అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. దీనితో ఒకే గ్రూప్‌లో 250 మంది వరకు ఉండొచ్చు. ఇది అచ్చం ఇన్‌స్టంట్ మెసేజింగ్ and VoIP సోషల్ ప్లాట్‌ఫామ్ అయిన 'డిస్‌కార్డ్' లాగా పనిచేస్తుంది. టాపిక్స్‌ వారీగా చాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు.

బ్రాడ్‌కాస్ట్ ఛానెల్స్‌లో కేవలం క్రియేటర్స్ మాత్రమే మెసేజ్‌లు పెట్టగలరు. కానీ కమ్యూనిటీ చాట్స్‌లో గ్రూప్‌లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా మోడరేషన్ టూల్స్ కూడా ఉంటాయి. అడ్మిన్స్ మెసేజ్‌లను, మెంబర్స్‌ని రిమూవ్ చేయొచ్చు. గ్రూప్ సేఫ్‌గా ఉండటానికి ఇవి బాగా యూజ్‌ అవుతాయి. ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీ చాట్స్‌ని రివ్యూ చేస్తుంది.

ప్లాట్‌ఫామ్ రూల్స్‌ని ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఇంకా దీనికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం, ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ప్రజలకు ఇంకా అందుబాటులో లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Instagram now lets you schedule DMs, helping you plan messages in advance. This feature improves your content strategy by ensuring timely, well-thought-out communication with your audience.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X