రూ.50కే నెలంతా తెలుగు సినిమాలు

భారతదేశపు ప్రముఖ టెలివిజన్ నెట్‌వర్క్‌లలో ఒకటైన సన్‌టీవీ నెట్‌వర్క్ డిజిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. హాట్‌స్టార్ యాప్ తరహాలో sun nxt పేరుతో తన మొట్టమొదటి వీడియో ఆన్ డిమాండ్ యాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌‍‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ అలానే యాపిల్ ఐఫోన్ యూజర్లు subscribe చేసుకోవల్సి ఉంటుంది. మినిమమ్ subscription ప్లాన్ ఖరీదు రూ.50.

రూ.50కే నెలంతా తెలుగు సినిమాలు

ఈ యాప్‌లో సన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని ఛానల్స్‌ను వీక్షించే వీలుంటుంది. sun nxt యాప్‌లో సభ్యత్వం తీసుకునే చందాదారులు డెస్క్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్స్ ఇలా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉన్న ఏ డివైస్ నుంచైనా సన్‌ నెట్‌వర్క్ ఛానల్స్‌ను స్ట్రీమ్ చేసుకునే వీలుంటుంది. హాట్ స్టార్ యాప్ తరహాలో sun nxt యాప్‌ ఉచితం కాదు. అయితే మొదటి నెల మాత్రం sun nxt సేవలను ఉచితంగా పొందే వీలుంటుంది. యాప్‌లోకి లాగిన్ అయ్యే సమయంలో రూ.50 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకుని పేమెంట్ ప్రొసీజర్‌ను కంప్లీట్ చేయవల్సి ఉంటుంది.

రూ.50కే నెలంతా తెలుగు సినిమాలు

sun nxt యాప్‌లో లైవ్ టీవీ సదుపాయంతో పాటు 4000 పై చిలుకు దక్షిణ భారత సినిమాలతో ఇంకా వీడియో ఆన్ డిమాండ్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ, బ్రాడ్‌బ్యాండ్ ఇలా ఏ
నెట్‌వర్క్‌లోనైనా sun nxt యాప్‌ పనిచేస్తుంది. హెచ్‌డి కంటెంట్ సపోర్ట్ ఈ యాప్‌కు మరో ప్రధాన బెనిఫిట్. దక్షిణ భారతదేశంలో సన్ నెట్‌వర్క్ నెం.1 టెలివిజన్ లీడర్‌గా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

 

English summary
Sun Nxt app launched, Digital Platform from Sun tv Network. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting