Just In
- 8 hrs ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- 10 hrs ago
తక్కువ ధరలో, ఎక్కువ ఫీచర్లతో, బెస్ట్ స్మార్ట్ టీవీలు ! లిస్ట్ ,ధరలు చూడండి!
- 13 hrs ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 15 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
Don't Miss
- News
ఏ క్షణమైనా ఢిల్లీ నుంచి వైఎస్ జగన్ కు పిలుపు: విశాఖ పర్యటన రద్దు?
- Sports
ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: హార్దిక్ పాండ్యా
- Movies
సమంతలా అరియానా గ్లోరి అరాచకం.. 'శాకుంతలం' గెటప్పులో మత్తెక్కించే పరువాలతో అంతా చూపిస్తూ!
- Finance
adani lic: భారీ నష్టాల్లో LIC.. కారణమేంటో తెలుసా..?
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
తెలంగాణా పోలీసుల చేతుల్లోకి దిమ్మతిరిగే టెక్ ఆయుధం,ఇకపై క్షణాల్లో సమాచారం..
అంది వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకొని మరింత వేగంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ముందుకు దూసుకెళుతోంది. ఇంతకు ముందు ఏదైనా సమాచారాన్ని రాష్ట్రంలోని యావత్ పోలీసు అధికారులకు ఏకకాలంలో పంపటం కష్టంతో కూడుకున్న పని. దాన్ని అధిగమించేలా ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేశారు.అంటే ఇప్పుడు తెలంగాణ పోలీసుల చేతికి సరికొత్త టెక్ ఆయుధం వచ్చి చేరనుంది. కేసారి లక్ష మందికి సందేశాలు.. ఆడియో.. వీడియో సందేశాల్ని పంపేందుకు వీలుగా.. వాట్సప్ ఫీచర్లను పోలి ఉండేలా సరికొత్త మొబైల్ అప్లికేషన్ Cop Connectను సిద్ధం చేశారు.

లక్ష మందితో..
దాదాపు లక్ష మందితో ఓ గ్రూప్ ఏర్పాటు చేసి, ఏ సమాచారాన్ని అయినా క్షణాల్లోనే పంపేలా సరికొత్త యాప్ 'కాప్ కనెక్ట్' సిద్ధమైంది. కాప్ కనెక్ట్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ ను ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నారు. త్వరలోనే దీన్ని వాడుకలోకి తీసుకురానున్నారు.

రాష్ట్రంలోని ఏ నేర సమాచారమైనా..
దీంతో రాష్ట్రంలోని ఏ నేర సమాచారమైనా... అంటే దొంగతనం, అదృశ్యం, కిడ్నాప్ వంటి ఏ నేరానికి సంబంధించిన సమాచారమైనా ఈ యాప్ ద్వారా 60 వేల మంది పోలీసుల అరచేతుల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. మిస్సింగ్ కేసులు.. గుర్తు తెలియని వ్యక్తుల హత్య లాంటి కీలక నేర ఉదంతాలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో రాష్ట్ర యంత్రాంగం మొత్తానికి తెలిసేందుకు వీలుగా ఈ యాప్ ఉంటుందని చెప్పక తప్పదు.

దేశంలోనే తొలిసారిగా..
దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్న క్రెడిట్ తెలంగాణ పోలీసులకు దక్కనుంది. 'కాప్ కనెక్ట్' పోలీసు వ్యవస్థ పనితీరులో మంచి మార్పు వస్తుందని స్వయంగా అధికారులే అంటున్నారు.

వాట్సప్ ..
ప్రస్తుతం పోలీసులు సమాచార బట్వాడాకు వాట్సప్ వంటివి వాడుతున్నారు. అయితే, వాట్సప్ లోని ఒక గ్రూప్ లో గరిష్ఠంగా 256 మందిని సభ్యులుగా చేర్చేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. దీంతో ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రూపులతో పోలీసులు సమాచారాన్ని పంపుకుంటున్నారు.

సర్వర్ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో..
ఇక ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మొబైల్ యాప్ కావాలని డీసీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతో కదిలిన పోలీసు టెక్నికల్ బృందం ప్రత్యేక డేటా బేస్ ను, యాప్ ను తయారు చేశారు. పోలీసులు మాత్రమే దీన్ని వాడుకునే వీలుంటుంది. దీని సర్వర్ హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఉంటుంది. ఇందులో కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ సభ్యులుగా ఉంటారు.

60 వేల మంది పోలీసులతో
60 వేల మంది పోలీసులతో ఓ గ్రూప్, సీఐలు, ఎస్ఐలతో ఓ గ్రూప్, పెట్రోలింగ్ కు తిరిగే బృందాలతో మరో గ్రూప్, క్రైమ్ కానిస్టేబుళ్లకు ఇంకో గ్రూప్, కోర్టు కానిస్టేబుళ్లకు మరో గ్రూప్... ఇలా ఎవరికి సంబంధించిన సమాచారం వారికి క్షణాల్లో అందేలా ఈ యాప్ పని చేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు.

పోలీసులకు సంబంధించిన సమాచారం
పోలీసులకు సంబంధించిన సమాచారం.. ఫోటోలు..వీడియోలు.. ఆడియోలు దీని ద్వారా షేర్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 60వేల మంది పోలీసు యంత్రాంగాన్ని ఈ యాప్ లో భాగస్వామ్యం చేస్తారు.

పోలీసులు మాత్రమే..
అయితే ఈ యాప్ పోలీసులు మాత్రమే ఉపయోగించే వీలుంటుంది. సామాన్యులకు దీనిలో ఎటువంటి ప్రవేశం ఉండదు. ఈ యాప్ లో షేర్ అయ్యే సమాచారాన్ని వేరే వారికి పంపే వీలు ఉండదు.

ఆరు నెలల శ్రమ అనంతరం..
ఆరు నెలల శ్రమ అనంతరం యాప్ సిద్ధమైందని, ఇటువంటిది ఇండియాలో మరే రాష్ట్రంలోనూ లేదని తెలిపారు. రెండు వారాల్లో దీన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనతోనే ఈ యాప్ రూపకల్పన జరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి చెబుతున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470